ఆర్ధిక నిర్వహణ కోసం ట్రస్మాతో చేతులు కలిపిన ప్రోటియం(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

పాఠశాలలకు మరింత సమర్థవంతంగా ఆర్ధిక నిర్వహణను అందించేందుకు  తెలంగాణా గుర్తింపుపొందిన పాఠశాలల మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ (ట్రస్మా) నిర్వహించిన ఎడ్‌ఎక్స్‌ స్కూల్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌ 2021 వద్ద ప్రోటియం చేతులు కలిపింది. ఎడ్యుప్రిన్యూర్స్‌, విద్యాసంస్థలు, ఎంఎస్‌ఎంఈలకు ప్రోటియం సాక్షర  మద్దతునందించడంతో పాటుగా దేశవ్యాప్తంగా పాఠశాలలకు వర్కింగ్‌ క్యాపిటల్‌, క్రీడా సదుపాయాలను మెరుగుపరచడం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి వాటి ద్వారా సహాయపడనుంది. ట్రస్మా నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణా రాష్ట్ర ప్రణాళిక సంఘ  ఛైర్మన్‌ బీ వినోద్‌కుమార్‌  హాజరుకాగా, విద్యారంగానికి చెందిన నిపుణులు సైతం ఈ సదస్సులో పాల్గొన్నారు.

ప్రోటియం మేనేజింగ్‌ డైరెక్టర్‌ ధృవ్‌ సూరి మాట్లాడుతూ ‘‘భారతదేశ వ్యాప్తంగా  పాఠశాల విద్యార్థులపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఈ విద్యార్థులకు విద్యనందించే పాఠశాలలు ఆర్ధిక సంక్షోభంలో  కూరుకుపోయాయి. ప్రోటియం ఇప్పుడు ఈ తరహా పాఠశాలలకు తగిన అవకాశాలు కల్పించడం ద్వారా ఏ ఒక్క విద్యార్ధి విద్యకు దూరం కారనే భరోసా అందిస్తున్నాం’’ అని అన్నారు.

2020లో మహమ్మారి కారణంగా భారతదేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్స్‌లో 1.5 మిలియన్‌ పాఠశాలలు మూతపడ్డాయి. తద్వారా 247 మిలియన్‌ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. ప్రొటియం సాక్షర ఇప్పుడు పాఠశాలలకు ఋణ పరిష్కారాలను అందించడంతో పాటుగా నూతన హైబ్రిడ్‌ అభ్యాస మోడల్‌ను స్వీకరించేందుకు తోడ్పడుతుంది.

‘‘కోవిడ్‌–19 మానవుని ఆరోగ్య పరంగా మాత్రమే  కాదు వారి జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. విద్యారంగం అందుకు మినహాయింపేమీ కాదు. దాదాపుగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలన్నీ మూతపడ్డాయి. మహమ్మారి ఆరంభమైన రెండేళ్ల తరువాత కూడా ఈ పాఠశాలలు ఫీజులు రాక, ఇతర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా తీవ్ర సంక్షోభంలో నుంచి బయటకు రాలేకపోతున్నాయి. ఈ  పాఠశాలలు తమంతట తాముగా కార్యకలాపాలు నిర్వహించేందుకు తగిన సహకారం అందించాల్సి ఉంది. ప్రోటీయం ఇప్పుడు చెప్పుకోతగ్గ మార్పును తీసుకురానుంది. పాఠశాలలకు ఋణాలను అందించడం ద్వారా ప్రకాశవంతమైన రేపటి తరం జీవితాలపై వాస్తవ ప్రభావం సృష్టించగలము’’ అని శ్రీ యాదగిరి శేఖర్‌ రావు, రాష్ట్ర అధ్యక్షులు, ట్రస్మా అన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: