గడివేముల మండలంను నంద్యాలలో కలపండి...
టిడిపి ఆధ్వర్యంలో ర్యాలీ
(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)
కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం,గడివేముల మండల పరిధిలోని టిడిపి నాయకులు,అభిమానులు మహా ర్యాలీ నిర్వహించి స్థానిక గడివేముల మండలం లోని ఎమ్మార్వో కార్యాలయంలో వారి యొక్క వినతి పత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే .... ర్యాలీ సందర్భంగా గడివేముల మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు 26 ఏర్పాటు చేయడం మాకు సంతోషంగా ఉందని, కానీ మా గడివేముల మండలం ను కర్నూలు జిల్లాలో చేర్చడం వల్ల గడివేముల మండలం లోని ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతారని,
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న. గడివేముల టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి
కర్నూలు జిల్లా 60 కిలోమీటర్ల దూరంలో ఉందని కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉండే నంద్యాల ప్రాంతాన్ని వదిలిపెట్టి 60 కిలోమీటర్లు ఉండే కర్నూలు జిల్లాలో గడివేముల మండలం ను ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమని దీన్ని ప్రభుత్వ అధికారులు దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ గారు తెలిపారు.S Scసెల్ అధ్యక్షులు నాగ శేషులు గాారు మాట్లాడుతూ
ఎస్సి సెల్ అధ్యక్షులు నాగ శేషులు
గడివేముల మండలంలోని ప్రజలకు నంద్యాల తో 70 సంవత్సరాల నుండి అనుబంధం ఉందని అలాంటి గడివేముల ప్రాంతమును 70 కిలోమీటర్ల దూరంలో ఉండే కర్నూలు జిల్లా లో కలవడం ఎంతవరకు సమంజసమని ప్రజా ప్రతినిధులు ఒకసారి ఆలోచన చేసుకోవాలని ప్రజా ప్రతినిధులు ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని గడివేముల మండలం ను నంద్యాల జిల్లాలో కలిపేందుకు ప్రయత్నం చేసి గడివేముల మండల ప్రజలు ఆనందంగా ఉండేందుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు