అంతా ప్రైవేటు మయం

సబ్ కా సాత్ సబ్ కా వికాస్... మాటలకే పరిమితం

మోడీ రాజ్యంలో కార్పొరేట్లకు లబ్ది

 ప్రభుత్వరంగ సంస్థల్లో 3.63 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ*

 ఏడేండ్లలో అత్యధికంగా ప్రయివేటు పరం

 పార్లమెంట్‌లో స్వయంగా వెల్లడించిన కేంద్రం ప్రభుత్వం

(జానో -జాగో వెబ్ న్యూస్_న్యూఢిల్లీ బ్యూరో)

గత 2014 ఎన్నికలకు ముందు చేసిన సబ్ కా సాత్ సబ్ కా వికాస్ వినోదం మాటలకే పరిమితమైంది. గత ప్రభుత్వాల కంటే రెండు అడుగులు ముందుకు వేసి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి కార్పెట్ పరిచింది. బలంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు సైతం వీరి వీరి అయ్యాయి.

మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమ (సీపీఎస్‌ఈ)ల్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణకు పచ్చజెండా ఊపారు. గత ఏడేండ్లలోనే సీపీఎస్‌ఈల్లో రూ.3,62,766 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నట్టు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్‌ కిషన్‌రావు కరడ్‌ పేర్కొన్నారు. లోక్‌సభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2014- 15 నుంచి 2020-21 వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మొత్తం రూ.3,62,766 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. 2020-21లో డిజిన్వెస్ట్‌మెంట్‌ రసీదుల కోసం సవరించిన అంచనా రూ. 32,000 కోట్లు కాగా, 31 మార్చి 2021 నాటికి ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ రశీదు రూ. 32,845 కోట్లు అంటే 2020-21లో రివైజ్డ్‌ ఎస్టిమేట్‌లో దాదాపు 103 శాతం ఇది ఉన్నది. 

ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ (కోట్లలో రూ.)

2014-15 24,349 

2015-16 23,997 

2016-17 46,247 

2017-18 1,00,057 

2018-19 84,972 

2019-20 50,299 

2020-21 32,845 

మొత్తం 3,62,766


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: