ఏబీఎం చర్చి ఆధ్వర్యంలో.....

అనాథ వృద్ధులకు దుస్తుల పంపిణీ

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల  ప్రతినిధి)

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలం లోని పెసరవాయి గ్రామం లోని ఏబీఏం చర్చి సంఘ పెద్దల ఆధ్వర్యంలో అనాధాశ్రమం ఉంటున్న 50 మంది వృద్ధులకు ఉచిత దుస్తులను పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే....... కన్నవారు ,కట్టుకున్నవారు, బంధుమిత్రులు, ఎంతోమంది ఉన్నా తమకు కడుపునిండా తిండి పెట్టలేక, తమ బాగోగులను తమ కష్టాలను చూసి మమ్మల్ని ఆదరించే వారు లేక, విలవిల్లాడుతున్న వృద్ధులకు మేమున్నామని, అధైర్య పడవద్దని, మాకు చేతనైన సహాయం సహకారాలు, అనాథ వృద్ధులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పెసర వాయి గ్రామంలోని ఏబీఏం చర్చి సంఘ పెద్దలు, స్త్రీలు, మరియు యువకుల ఆధ్వర్యంలో "సెమీ క్రిస్మస్"పండుగ సందర్భంగా ఆత్మకూరు మండలం, కరివేన గ్రామం లోని, ఎస్సార్బీసీ కాలనీలో గల "మానవతా నిలయం"(వృద్ధాశ్రమం) లో 


ఉంటున్న 50 మంది అనాథ వృద్ధులకు చలి తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉండడంతో 50 మంది అనాథ వృద్ధులకు రగ్గులను, 23 మంది మహిళలకు చీరలను, 27 మంది పురుషులకు అంగీలను ఉచితంగా పంపిణీ చేశారు. పెసర వాయి గ్రామానికి చెందిన బిసి బాలుడు 25 రగ్గులను విరాళంగా ఇవ్వగా, ఏబీఏం చర్చి సంఘ కాపరి, స్త్రీలు,మరియు యువకులు దుస్తులను, రగ్గులను,విరాళంగా అనాధ వృద్ధులకు అందించారు. ఈ కార్యక్రమంలో పెసర వాయి ఏబీఏం చర్చి పాస్టర్ రాజేష్, నాగరాజు, బాలరాజు,వెంకటరమణ, లింగరాజు, రాజమ్మ, శేషమ్మ, సుంకమ్మ, రమాదేవి, ఏబీఏం సంఘ సభ్యులు పాల్గొన్నారు.
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: