గడివేముల జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయుని పై...

దర్యాప్తు ప్రారంభించిన...డీఈఓ రంగారెడ్డి

 విద్యార్థులు ని అడిగి వివరాలు తెలుసుకుంటున్న డీఈఓ రంగారెడ్డి, డి ఐ ఉర్దూ రేంజి ఆదం భాష

(జానో -జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలం, గడివేముల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో గత కొద్ది కాలం నుండి ప్రధానోపాధ్యాయుల నియంతృత్వ పోకడలకు అద్దం పడుతుంది. ఎంతో ఉన్నత మైన విద్యాబుద్ధులను పిల్లలకు బోధించే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు, సహచర ఉపాధ్యాయులకు మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకునే దాకా వెళ్లాయి. ఈ విభేదాలు తారా స్థాయికి చేరాయని చెప్పడం సమంజసంగా ఉంటుంది.

మాట్లాడుతున్న డీఓ రంగారెడ్డి
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నాడు పాఠశాలలో ఎంతో మంది విద్యార్థిని, విద్యార్థులకు ఉన్నతమైన క్రమశిక్షణ,  విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాల నేడు ఉపాధ్యాయుల వల్ల పాఠశాల పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఒక సీనియర్ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా తనకు ఆరోగ్యం సరిగా లేదని అన్ని రోజులు వచ్చినట్లు అటెండేన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసుకుంటున్నాడని, ఈ విషయం ప్రధానోపాధ్యాయులు సహకారంతోనే జరుగుతుందని, పాఠశాలలో పాఠశాలలో ఉండే పాత ఫర్నిచర్ ను సైతం అమ్ముకొని తన సొంత ఖర్చుల నిమిత్తం వాడుకుంటున్నాడు అని, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఒడి పథకం లో భాగంగా ప్రతి విద్యార్థిని, విద్యార్థులకు 15 వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని, స్కూల్ పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు స్కూల్ పరిసరాల ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి విద్యార్థినీ, విద్యార్థుల వద్ద నుండి వెయ్యి రూపాయలు వసూలు చేసిన డబ్బులు సైతం ప్రధానోపాధ్యాయులు స్వాహ చేసి వాటికి సంబంధించిన లెక్కలు తారుమారు చేశారని, 
స్కూలు మధ్యాహ్నన భోజన పథకాన్ని పరిశీలిస్తున్నన డిఈఓ, , డిఐ ఉర్దూ రేంజి ఆదం భాష, ఎంఈఓ బ్రహ్మం

 

మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న వారితో తనకు కొంత పైకం అందజేయాలని అలా చెల్లించకపోతే మీరు మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా నిర్వహించడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని వేధింపులకు గురి చేస్తున్నాడని , పాఠశాలలో తన మాట వినని ఉపాధ్యాయుల జీతాలు నిలిపివేసి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడని, స్కూల్ కమిటీ చైర్మన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.


ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా డిఈఓ రంగారెడ్డి, డిఐ ఉర్దూ రేంజి ఆదామ్ భాష గారు, ఎంఈఓ బ్రహ్మం. గడివేముల ఉన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలను సందర్శించి ప్రధానోపాధ్యాయుని తీరుపై ఉపాధ్యాయులను, మరియు పిల్లలను అడిగి తెలుసుకున్నారు, అనంతరం డిఈఓ రంగారెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ... గడివేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పై అనేక ఆరోపణలు వచ్చాయని, ప్రజాప్రతినిధులు సైతం తమకు ఆరోపణలు తెలియజేశారని, ఆరోపణలు ఎంత వరకు నిజం ఉందని తెలుసుకునేందుకు విచారణ చేపట్టామని, విచారణలో ప్రధానోపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, ఆర్థికంగా స్కూల్ కి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, మధ్యాహ్న భోజన పథకం పై కూడా ఆరోపణలు వచ్చాయని, మధ్యాహ్న  భోజన పథకం నిర్వాహకులు ఎలా అమలు చేస్తున్నారని పిల్లలు అడిగి తెలుసుకున్నామని" మిడ్ డే మీల్స్" బాగా ఉందని పిల్లలు తెలిపారని పేర్కొన్నారు.

ప్రధానోపాధ్యాయులు స్కూల్లో విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, ఉపాధ్యాయులు మాత్రం పిల్లలకు పాఠాలు సక్రమంగా బోధిస్తారని, mbln2 లో గడివేముల జడ్.పి.హెచ్.స్స్కూలు సెలెక్ట్ అయిందని, కావున స్కూల్ ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. పిల్లల బాత్ రూం లో నీటి సౌకర్యం లేదని, పిల్లలు తాగేందుకు మంచినీటి సదుపాయం కూడా లేదని, అదేవిధంగా స్కూల్ ప్రాంగణంలో చెత్తాచెదారం ఎక్కువగా ఉండి దుర్గంధం వెదజల్లుతూ ఉందని, రెండు మూడు రోజుల్లో సమస్యలు తీర్చాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించామని తెలిపారు, డిఈఓ దర్యాప్తు చేసిన సమగ్ర నివేదికను ఆర్జెడికి రెండు లేదా మూడు రోజుల్లో నివేదిక అందజేస్తామని అందులో తప్పు చేసిన వారిపై శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం ఎంఈఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.


               


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: