క్రిస్మస్ వేడుకల్లో  పాల్గొని పేర్ని నాని

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని పేర్కొన్నారు. దేవుడు సూచించిన శాంతి ప్రేమ సహనం మార్గాలలో  ప్రతి ఒక్కరూ పయనిస్తూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగిందని తెలియజేశారు.కులమతాలకు అతీతంగా మానవాళి అభ్యున్నతికి ఆచరణియమైన భోదనలు అందించిన గొప్ప మానవతావాది ఏసుక్రీస్తు అని, మంచి చెడుల వ్యత్యాసాన్ని గుర్తించి మంచి తనంతో, విశ్వాసంతో సమాజంలో పొరుగువారి పట్ల సోదర భావంతో మెలగుతూ సుఖసంతోషాలతో జీవించాలని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: