మంచి గుడ్డుకే దిక్కులేదు...ఇక ఎక్కడ గుడ్ గవర్నన్స్

రాష్ట్ర ప్రభుత్వంపై సోమువీర్రాజు ఫైర్


(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు మంచి గుడ్డుకే దిక్కులేదు...ఇక ఎక్కడ గుడ్ గవర్నన్స్ కనిపిస్తుందని రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఏపీ ఛీప్ సోమువీర్రాజు ఫైర్ అయ్యారు. ఈ మేరకు సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలోని సారాంశం ఇలావుంది....నాణ్యతా  నీ చిరునామా ఎక్కడ... ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహారం పేరుతో నాణ్యతలేని ఆహారం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇచ్చే కోడిగుడ్డు కుళ్లుకంపు వచ్చి వాంతులౌతున్న సంఘటనలు నమోదు అవుతున్నాయి ప్రభుత్వం ఏం చేస్తోంది. వ్యవస్థల్లో అజమాయిషీ స్ధానంలో అవినీతి చోటు  చేసుకుంటోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే  సమాధానం రాదు పరిపాలనంటే ఇదికాదు. ఒక్క పాఠశాలలకే 50 లక్షల కోడిగుడ్లు సరఫరా నిత్యం చేయాలి  ఇవికాకుండా బాలింతలకు, హాస్టల్ విద్యార్ధులకు, కస్తూరీబా పాఠశాలలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చే  పౌష్టికాహారం మాటేంటి. ఎగుమతులకు పనికి రాని గుడ్లను  సేకరించి ఏజెన్సీలు నాణ్యత లోపించిన గుడ్లు నిభందనలకు విరుద్దంగా పంపిణీ చేస్తున్నారు అంటే వీటి వెనుకున్న  అవినీతి తిమింగలాలకు వెన్నుదన్నుగా  నిలిచిన వారి వెన్ను విరవాలి. ప్రభుత్వం ఆదిశగా ఎందుకు అడుగులు వేయడం లేదని ప్రశ్నిస్తున్నాను. బహిరంగ లేఖ ద్వారా  మచ్చుకు  కొన్ని సంఘటనలు  ప్రభుత్వం ద్రుష్టికి  తీసుకుని వస్తున్నాను.


అనేక ప్రాంతాల్లో  విద్యార్ధులు  ప్రభుత్వం అందించే గుడ్లును ఆహారంగా తీసుకుని  ఆసుపత్రి పాలౌతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి ప్యాలెస్ వదిలి రారు అందుకే ముఖ్యమంత్రికి  ఈ విషయాలను బహిరంగ లేఖ ద్వారా  తెలియ చేస్తున్నాను. మీ  ప్రభుత్వం తోలు మందంగా వ్యవహరిస్తోంది. అభశుభం తెలియని విద్యార్ధులకు నాణ్యత లేని గుడ్లు అందిస్తున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు  తమ  భాద్యతను  నిర్వర్తించడం  లేదు. ప్రతి పాఠశాలలోను వారికి గుడ్డు లేదా ఇతర ఆహార పదార్ధాలను అందించిన తరువాత  వాటిని ఛాయా చిత్రీకరణ చేసి  ప్రభుత్వానికి పంపిస్తున్నా  ఎందకు ఈ విధంగా జరుగుతుందో  ప్రభుత్వం తెలుసుకోదా అని ప్రశ్నిస్తున్నాను.. గోదామాల్లో నిల్వ ఉంచిన సందర్భంలో కూడా  సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏదశలోను కూడా  పర్యవేక్షణ లేక పోవడంతో  కోడిగుడ్లు  కుళ్లి కంపు వచ్చినవి పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. అయినా  ప్రభుత్వం  పర్యవేక్షించడంలేదు. కోడిగుడ్లు తిని  ఆసుపత్రి పాలౌతున్నా అధికారులు పై కఠిన చర్యలు  ప్రభుత్వం ఎందుకు  తీసుకోవడం లేదు. ఎందుకంటే కోడిగుడ్లు సరఫరా  అధికార పార్టీ  నేతల హస్తం ఉందా అని బహిరంగ లేఖ ద్వారా  ప్రశ్నిస్తున్నాను.

శ్రీకాకుళం జిల్లా భామిని మండలంలోని బాలేరు ప్రాధమిక పాఠశాలలో కోడిగుడ్లు తిని  95 మందికి అస్వస్థతకు గురవ్వగా కోడిగుడ్లు సరఫరా చేసిన వ్యాపారి మీద  ఏం చర్య తీసుకున్నారని ప్రశ్నిస్తున్నాను. విజయవాడ నగరంలోని  60వ డివిజన్  వాంబే కాలనీలోని నగర పాలక సంస్థ పాఠశాలలో  కోడిగుడ్డు ఉడక బెట్టిన తరువాత రంగుమారుతోందని ఫిర్యాదులు వస్తున్నా  అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. ఈ విధంగా  పలు జిల్లాల్లొ ఈ ఫిర్యాదులు వచ్చినా  ప్రభుత్వం మొద్దు నిద్రవల్ల చర్యలు ఉండడంలేదు. ఒక్కో ఏజెన్సీ నుండి 30 నుండి 40 వేల గుడ్లను  10 రోజులకు ఒక పర్యాయం ఇవ్వడం వల్ల కూడా  సమస్యలు వస్తున్నా ప్రభుత్వ పర్యవేక్షణ సున్నా గా  ఉంది.

యధా రాజా  తధా ప్రజ అన్న చందంగా పరిపాలన సాగుతుండడం  వల్ల నాణ్యమైన ఆహారం అందని పరిస్థితి ఏర్పడుతోంది.  ఒక్క పాఠశాలలకే 50 లక్షల కోడిగుడ్లు సరఫరా నిత్యం చేయాలి  ఇవికాకుండా బాలింతలకు, హాస్టల్ విద్యార్ధులకు, కస్తూరీబా పాఠశాలలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చే  పౌష్టికాహారం మాటేంటి. సర్వశిక్షాభియాన్ పధకంలో  కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ  రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందించడంలో పర్యవేక్షణ  ఎందుకు లేదు. పధకాలు పేర్లు మార్చడం  కాదు నాణ్యతతోకూడిన ఆహారం ఇవ్వాలి. ఇక నైనా ప్రభుత్వం స్పందించక పోతే బిజెపి శ్రేణులు స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తుందని బహిరంగ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.అని ఆ లేఖలో సోమువీర్రాజు పేర్కొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: