గుర్తుకొస్తున్నాయి... గుర్తుకొస్తున్నాయి.. అలనాటి రోజులు
పూర్వ విద్యార్థుల సమ్మేళనం..
గురువులను ఘనంగా సన్మానించి... నాటి స్మృతులను నెమరువేసుకుంటూ
(జానో -జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)
కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1997-98 సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యను నేర్పించిన గురువులు కృష్ణమూర్తి, జయమ్మ, సుబ్బరామయ్య, హసీన్, ముర్తుజావలి, ప్రసాద్, సర్దార్ హుస్సేన్, పిచ్చి రెడ్డి, సిద్ధార్థ రెడ్డి, తదితర గురువులు అందరిని పూలమాలలతో, శాలువాతో, ఘనంగా సన్మానించారు. అనంతరం గురువులు మాట్లాడుతూ చిన్నతనంలో మేము విద్యను నేర్పించిన విద్యార్థులు ఎక్కడ, ఎక్కడున్నారో మాకు తెలియదు, కానీ ఈరోజు మా విద్యార్థిని, విద్యార్థులు అందరూ మన పాఠశాలలో కలవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉందని కొనియాడారు.
అనంతరం 97-98 బ్యాచ్ విద్యార్థులు మాట్లాడుతూ చిన్ననాటి మిత్రులు అందరం ఒక చోటికి చేరి మా సంతోషాలను మిత్రులతో పంచుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు.అనారోగ్యం కారణంగా మా సోదరి శాంతి లత భర్త చనిపోవడం మాకెంతో బాధాకరమని అతని ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి, శాంతి లత గారికి పది వేల రూపాయల ఆర్థిక సహాయం 1997-98 బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి అందజేస్తున్నామని ప్రకటించారు. ఈ సమ్మేళన కార్యక్రమంలో 1997-98 సంవత్సరం పదో తరగతి విద్యార్థిని, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులతో సహా అందరూ పాల్గొన్నారు.
Home
Unlabelled
గుర్తుకొస్తున్నాయి... గుర్తుకొస్తున్నాయి.. అలనాటి రోజులు... పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. గురువులను ఘనంగా సన్మానించి... నాటి స్మృతులను నెమరువేసుకుంటూ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: