పాత పథకాలు పునరుద్దరించి...

సబ్ ప్లాన్ చట్టం అమలు చేయాలి

జానో జాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్

జానో జాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

దుల్హాన్, మైనార్టీల విదేశీ రుణ పథకంవంటి ఎన్నో పథకాలు మైసీపీ ప్రభుత్వం వచ్చాక పక్కనెట్టేశారని, దీనివల్ల మైనార్టీ లబ్ధిదారులు  ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారని జానో జాగో సంఘం(ముస్లింల అభిద్ది వేదిక) సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ విమర్శించారు. ఈ పథకాలను  పునరుద్దరించి వీటితోపాటు ఇటీవల ఆమోదం తెలిపిన సబ్ ప్లాన్ చట్టాన్ని పట్టిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశీ రుణం పథకం కింద లబ్ధిచేకూరుతుందని భావించిన ఎంతో  మంది ముస్లిం విద్యార్థులు విదేశాలలో చదవుతున్నారని, కానీ ఈ పథకం కింద రుణాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పథకాన్ని అమలు చేయకుండా, రుణాలు అందించకుండా మైనార్టీల కోసం సబ్ ప్లాన్ చట్టం తీసుకోచ్చామని చెప్పినా వైసీపీ ప్రభుత్వంపై విశ్వాసం కలగదన్నారు. టీడీపీ హయాంలో వరకు విదేశీ విద్యా పథకం కింద మైనార్టీ విద్యార్థులకు అందుతున్న రుణాన్ని నిర్ధాక్షణ్యంగా ఆపేసి వారు రోడ్డుపాలయ్యేలా చేయడం ఎంతవరకు సమంజసమని సయ్యద్ నిసార్ అహ్మద్ ప్రశ్నించారు. విదేశాల్లో చదివే ఈ మైనార్టీ విద్యార్థులు తమ చదువును కొనసాగించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రుణం కోసం ఎదురుచూస్తున్నారని, వీరికి రుణం అందించి ఆదుకోకుండా మైసీపీ ప్రభుత్వం మైనార్టీలకు సబ్ ప్లాన్ చట్టం తీసుకొచ్చామని చెప్పడం భూట్టకమే అవుతుందని ఆయన స్పష్టంచేశారు.


అమ్మబడి, జగనన్న విద్యా దీవెన వంటి పథకాలు తీసుకొచ్చి పేద విద్యార్థులను ఆదుకొంటున్నామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం విదేశాల్లో చదవుతూ రాష్ట్ర ప్రభుత్వం సహాయం కోసం ఎదురుచూస్తున్న వారిపట్ల అలాంటి ప్రేమను ఎందుకు చూపడంలేదన్నారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు సొంతంగా వెళ్లి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరడంలేదన, టీడీపీ హయాంలో తీసుకొచ్చిన విదేశీ రుణ పథకం కింద లబ్ధిదారులుగా ఎంపికై రాష్ట్ర ప్రభుత్వం భరోసా మేరకే వారు విదేశాల్లో చదువు కోసం వెళ్లారన్నది వైసీపీ ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రభుత్వాలు మారినంత మాత్రానా పేదలను రోడ్డుపై వదిలేసేలా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వాలు తీసుకోకూడదన్నారు.

టీడీపీ తమ ప్రత్యర్థి అయినంత మాత్రానా ఆ పార్టీ ప్రభుత్వం తెచ్చిన పథకాలను రద్దు చేయడం సమంజసం కాదని, రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభేదాలను ఎన్నికల రణక్షేత్రంలో తేల్చుకోవాలని ఆయన అన్నారు. అంతేకానీ ప్రత్యర్థి పార్టీపై ఉన్న వ్యతిరేకతతో ఆ పార్టీ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిపొందే పేదలపై ప్రతాపం చూపకూడదన్నారు. వెంటనే విదేశీ విద్యా రుణం పథకం కింద విదేశాల్లో చదవుతున్న మైనార్టీ విద్యార్థులకు రుణం మంజూరుచేసి వారిని ఆదుకోవాలని సయ్యద్ నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు. లేకపోతే ఇదే వైసీపీ ప్రభుత్వానికి శాపంగా మారుతుందని ఆయన విమర్శించారు. ప్రతి ఏడాది మైనార్టీలకు కేటాయించే బడ్జెట్ వేరు, సబ్ ప్లాన్ కింద ఖర్చు చేయాల్సిన బడ్జెట్ వేరని, ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జానో జాగో సంఘం అవగాహన సభలు ఏర్పాటు చేస్తుందన్నారు. వార్షిక బడ్జెట్ వేరు  సబ్ ప్లాన్ చట్టం కింద అందే బడ్జెట్ వేరు అన్నది తెలుసుకోకపోతే ముస్లింల కోసం ఎన్నిచట్టాలు తీసుకొచ్చినా ప్రయోజనం ఉండదన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లింమా...ఆయన  ముస్లిం అయితే ఆయన భౌతికాయానికి పార్శీ మత ఆచారాల  ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేశారు... ఇది తెలుసుకోవాలని ఉందా...అయతే మీ jaanojaagotv నీ Subscribe చేసుకోండి 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaagotv నీ Subscribe చేసుకోండి

             


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: