నేటి నుంచి సొంత జిల్లాలో...ముఖ్యమంత్రి జగన్
మూడు రోజుల పాటు జిల్లాలోనే
(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)
నేటి నుంచి 3 రోజుల పాటు తన సొంత జిల్లాలో ముఖఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ ఉదయం పదిన్నరకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 11గంటల 15 నిమిషాలకు కడప ఎయిర్‌పోర్టుకు జగన్ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రొద్దుటూరు మండలం బొల్లవరం గ్రామానికి ముఖ్యమంత్రి కార్యక్రముంది. వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రొద్దుటూరులో మండలంలో దాదాపు 516కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం శుంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బద్వేలు నియోజకవర్గం గోపవరం చేరుకుంటారు. గోపవరంలో 2వేల మందికి ఉపాధి కల్పించేలా 956 కోట్ల రూపాయల పెట్టుబడితో సెంచురీఫ్లై పరిశ్రమకు...సీఎం జగన్ శంకుస్ధాపన చేస్తారు. అక్కడి నుంచి సీకేదిన్నె మండలం కొప్పర్తి చేరుకుని... వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ప్రారంభిస్తారు. ఇక్కడ 613కోట్ల రూపాయలతో తలపెట్టిన పరిశ్రమలకు శుంకుస్థాపన చేస్తారు. సాయంత్రం ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్ హౌస్‌లో రాత్రి బస చేస్తారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?
ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ రాబోతోంబది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: