మహేష్, మహేశ్వరి కుటుంబాన్ని ఆదుకోవాలి

కందుల నారాయణ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఇటీవల ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని గొబ్బూరు గ్రామ సమీపంలో గౌరవ రాష్ట్ర మంత్రి కాన్వాయ్ లోని వాహనం ఢీకొని మార్కాపురం పట్టణంలోని కొండా రెడ్డి కాలనీకి చెందిన చిరు వ్యాపారం చేసుకునే భార్యభర్తలు మహేష్, మహేశ్వరిలు  మరణించారని, వారి కుటుంభాన్ని ఆదుకోవాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. మార్కాపురం పట్టణలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహేష్, మహేశ్వరి కుటుంబంలోని మిగతా ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఈ ఇద్దరి సంపాదన మీదే ఆధారపడి జీవిస్తున్నారు. అయినను ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గానీ, వైసిపి నాయకులు గానీ కనీస స్పందన లేకపోగా వారి కుటుంబాన్ని పలకరించిన పాపాన పోలేదని ఇకనైనా తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అడిగారని సినిమా టికెట్ ధరలు తగ్గించారని,  తక్షణమే ఆకాశంలో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

కందుల నారాయణ రెడ్డి 

ఇంకా ఎక్కువ తాగమని మద్యం ధరలు తగ్గించారని, తక్షణమే దమ్ముంటే విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని డిమాండ్ చేశారు.      ఓ టి ఎస్ పేరు మీద గతంలో కట్టిన ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయిస్తామని ప్రతి ఒక్కరి నుండి పదివేల రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారని ఇలాగైతే ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం 

      ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మార్కాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, మార్కాపురం మున్సిపల్ కౌన్సిలర్ ఎరువ వెంకట నారాయణ రెడ్డి, తెలుగు మహిళలు పోరుమామిళ్ల విజయ లక్ష్మి, చెన్న లక్ష్మి, పాల వలి తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి    

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: