శాంతిభద్రతలు కుప్పకూలాయి

డీజీపీకి చంద్రబాబు నాయుడు లేఖ


(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకులాయని  మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కుప్పం ఐ-టీడీపీ సభ్యులు మురళి పై వైసీపీ గుండాల దాడిని ఖండిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆ లేఖలోని సారాంశం ఇలావుంది. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు కుప్పకూలి పోతున్నాయి.  ప్రతిపక్ష టిడిపి నాయకులు, సానుభూతిపరులపై పదేపదే హింసాత్మక దాడులు జరుగుతున్నప్పటికీ దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేదు.  వైసీపీ నేతలు, గూండాలు ఓ వర్గం పోలీసులతో కుమ్మక్కై ప్రతిపక్ష టీడీపీ నేతల ప్రజాస్వామిక గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కుప్పం ఐ-టీడీపీ సభ్యులు సి. మురళిని 20 డిసెంబర్ 2021 మధ్యాహ్నం అధికార పార్టీ గూండాలు కుప్పం పట్టణంలో కిడ్నాప్ చేసారు. మురళిని నేరుగా రెస్కో చైర్‌పర్సన్ జిఎస్ సెంధిల్ కుమార్ ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. సెంధిల్ కుమార్, అతని అనుచరులు మురళిపై దాడి చేసి కొట్టి  చంపేస్తామని బెదిరించారు.  ఆ తర్వాత సెంధిల్ కుమార్ అనుచరులలో ఒకరు... హెచ్‌ఎం మురుగేష్ కు గురించిన వాంగ్మూలాన్ని  బలవంతంగా మురళి చేత చెప్పించి వీడియో రికార్డ్ చేశారు. వైసీపీ గుండాల దాడిలో మురళి కుడి కన్ను , ముఖం పై తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత 20 డిసెంబర్ 2021 సాయంత్రం 6.30 గంటల సమయంలో సెంధిల్ కుమార్ ఇంటి నుంచి రెండు కార్లు, రెండు బైక్‌లలో అతన్ని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కొట్టారు. తనను కిడ్నాప్ చేసి దాడి చేసినట్లు బయటపెడితే తీవ్ర పరిణామాలుంటాయని మురళిని బెదిరించారు. దీనితో, మురళి భయపడి 23 డిసెంబర్ 2021 వరకు ఈ ఘోరమైన సంఘటన గురించి బయటకు చెప్పలేదు.  భవిష్యత్తులో మురళిపై ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ప్రతిపక్ష పార్టీల స్వేచ్చ కాపాడే దృష్ట్యా పోలీసులు విచారణ జరిపి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం సముచితం. అదే సమయంలో, మురళికి తగిన రక్షణ కల్పించాలి. పోలీసుల సత్వర చర్యలు మాత్రమే రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించబడుతాయి. రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ ఇచ్చిన హామీలు కాపాడబడతాయి. అని ఆయన పేర్కొన్నారు.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: