గవర్నర్ ను కలసిన... తూర్పు నావికా దళాధిపతి


  (జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

తూర్పు నావికాదళ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్‌గా భాద్యతలు స్వీకరించిన నేపధ్యంలో వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. మంగళవారం ఉదయం నావికదళ అధికారులతో కలిసి రాజ్ భవన్ కు వచ్చిన దాస్ గుప్తాకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన తదుపరి మొదటిసారిగా గవర్నర్ ను కలిసిన వైస్ అడ్మిరల్ సముద్ర తీరం వెంబడి దేశ భద్రతకు సంబంధించి ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించేందుకు తూర్పు నావికాదళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను గురించి దాస్ గుప్తా గవర్నర్ కు వివరించారు. దేశ భద్రత విషయంలో రాజీలేని ధోరణిని అనుసరించాలని ఈ సందర్భంగా గవర్నర్ నావికాదశ అధికారులకు సూచించారు. మరోవైపు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో విశాఖపట్టణంలో జరగనున్న ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ రివ్యూ, మల్టినేషనల్‌ మేరిటైమ్‌ ఎక్సర్‌సైజ్‌ మిలాన్‌ సన్నాహక కార్యకలాపాల పురోగతిని కూడా నావికాదళ అధికారులు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు వివరించారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: