బీసీ-(ఇ) జాబితాలోని వారిని....

ఓబీసీ జాబితాలో చేర్చండి

జాతీయ బీసీ కమిషన్ కు జానో జాగో సంఘం బృందం లేఖ

సయ్యద్ నిసార్ అహ్మద్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

బీసీ-(ఇ) గ్రూపులోని ముస్లిం సామాజిక తరగతులను జాతీయ  వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు జానో జాగో (ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార అహ్మద్ కోరారు. ఈ మేరకు జాతీయ  బీసీ కమిషన్ కు  జానో జాగో (ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్, జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, ఏపీ రాష్ట్ర సలహాదారు షేక్ అబ్దుల్  రజాక్,  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ముంతాజ్ ఫాతిమా మెయిల్ ద్వారా ఓ వినతిపత్రం పంపారు. ఓబీసీ జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని బీసీ-(ఇ) గ్రూపులోని  కులాలను చేర్చాల్సిన ఆవశ్యతను ఆయన తెలియజేశారు. ఆయన వినతిపత్రంలోని ముఖ్యాంశాలు ఇలావున్నాయి....తెలుగు రాష్ట్రాల్లోని బీసీ-(ఇ) కేటగిరీలో ఉన్న ముస్లిం సామాజిక తరగతుల పేర్లను జాతీయ వెనుకబడిన తరగతుల (ఓ‌బీసీ) జాబితాలో చేర్చాలని కోరుతూ ఆ లేఖలో  కోరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో 2007లో  రాష్ట్ర బీసీ కమిషన్ సర్వే చేసి   ముస్లింలలోని  15 సామాజిక తరగతుల ప్రజలను సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారిగా గుర్తించి,  వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చింది. GO no 23/ 2007 ప్రకారం గత దశాబ్దకాలంగా 4శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. రాష్ట్ర విజభన అనంతరం రెండు ఆంధ్రప్రదేవ్, తెలంగాణ రాష్ట్రాలలో బీసీ-(ఇ) రిజర్వేషన్లు అమలవుతున్నాయి. జాతీయ వెనుకబడిన తరగతుల జాబితాలో ఈ 15 సామాజిక తరగతుల పేర్లు చేర్చనందన జాతీయస్థాయి రిజర్వేషన్లు వీరికి అందడం లేదు.  జాతీయ స్థాయి విద్యా సంస్థలలో, ఉద్యోగాలలో వీరికి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. గతంలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ విచారణ నిర్వహించిన సందర్భంగా ఇదే విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినా జాతీయ వెనుకబడిన తరగతుల జాబితాలో చోటు లభించలేదు. మరల  జాతీయ వెనుకబడిన తరగతుల జాబితాలో   కొత్త  పేర్లను చేర్చడం కోసం జాతీయ బీసీ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ సామాజిక తరగతుల నుండి అభిప్రాయాలు సేకరిస్తున్న నేపథ్యంలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలలోని బీసీ-(ఇ) జాబితాలోని ఆ తరగతుల ప్రజలను జాతీయ వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చి న్యాయం చేయాలని లేఖలో కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, సీఎంలు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని జాతీయ వెనుకబడిన తరగతుల జాబితాలో   బీసీ-(ఇ) కేటగిరిలోని సామాజిక తరగతుల  పేర్లను చేర్పించాలని కోరుతున్నామని వారు పేర్కొన్నారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: