భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం గొప్పతనం

పుస్తకావిష్కరణ సభలో జానో జాగో నేత సయ్యద్ నిసార్ అహ్మద్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనమని జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక) సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. ఆదివారం నాడు పాతబస్తీలోని జానో జాగో సంఘం నగర కార్యాలయంలో హిందూ.. ముస్లిం ఐక్యత దినోత్సవం నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహ్మద్ రచించిన ప్రధమ భారత స్వతంత్ర హిందూ ముస్లింల ఐక్యత అనే పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. హిందూ వాది అయిన బిస్మిల్ ప్రసాద్. ఇస్లాం వాది అయిన అస్ఫకుల్లా ఖాన్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరులయ్యారన్నారు. 


అంతేకాకుండా వీరు ఇరువురు ఎంతో స్నేహంగా మెలిగి భారతదేశానికి హిందూ-ముస్లింల ఐక్యత చిహ్నంగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. హిందూ, ముస్లిం ఐక్యత వంటి వీరి ఆదర్శాలను ప్రజల్లోకి  తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి వాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ...బిస్మల్ ప్రసాద్, అస్పఖుల్లా ఖాన్ స్నేహ హిందూ, ముస్లింల ఐక్యతకు చిహ్నమని పేర్కొన్నారు. ఈ చిహ్నం చెక్కచెదరకుండా భారతీయులంతా తమ బాధ్యతగా కాపాడుకోవాలని ఆయన కోరారు.

జానో జాగో మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షురాలు అస్ఫియా మాట్లాడుతూ...హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు ఇలా దేశంలోని అన్ని మతాలు స్నేహపూర్వంగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశమని ఆచరణలో బిస్మిల్ ప్రసాద్, అస్పఖుల్లా ఖాన్ నిరూపించారని ఆమె పేర్కొన్నారు. వారి ఆదర్శాలను మహిళలలోకి జానో జాగో మహిళా విభాగం పెద్ద ఎత్తున్న తీసుకెళ్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు అబ్దుల్ రెహమాన్, నసీర్, మోయిన్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.

 






Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: