యూట్యూబ్ లో సమంత రచ్చపైనే...సర్చింగ్

అందరితో ఉఊ...అనిపించిన సమంతా

(జానో జాగో వెబ్  న్యూస్-సినిమా బ్యూరో)

ఒక ఐటమ్ సాంగ్ తో ఆమె తన క్రేజ్ ను రెట్టింపు చేసుకొన్నారు సమంత. ఈ ఏడాది తెరకెక్కిన సినిమాల్లోని కొన్ని పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి. స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి స్పెషల్ సాంగ్ చేసి ఇండస్ట్రీతో పాటు యూట్యూబ్‌ని షేక్ చేసింది. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేసింది సామ్. ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ అంటూ మాస్ బీట్‌తో సాగిపోయిన ఈ పాట ఆన్ లైన్ మాద్యమాలపై గత రికార్డులు తిరగరాసింది. విడుదలైన 24 గంటల్లోనే 12.39 మిలియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త ఫీట్ అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత మరోసారి పోలీస్ గెటప్‌లో కనిపించబోతున్నారు. దగ్గుబాటి రానాతో కలిసి సాగర్ కే చంద్ర దర్శకత్వంలో 'భీమ్లా నాయక్' మూవీ చేస్తున్నారు. తమన్ కంపోజ్ చేసిన ఈ సినిమా టైటిల్ సాంగ్‌ లిరికల్ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన దక్కింది. విడుదలైన 24 గంటల్లోనే 10.20 మిలియన్ వ్యూస్ రాబట్టి ఈ ఏడాది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటల జాబితాలో చేరింది.

ఇదిలావుంటే  కరోనా దెబ్బకు కుదేలైన సినీ ఇండస్ట్రీలో 2021లో కొన్ని బెస్ట్ సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. కరోనా టెన్షన్ నుంచి పూర్తిగా బయట పడకపోయినా తమ తమ సినిమాలపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో కొంతమంది నిర్మాతలు ధైర్యం చేసి పలు సినిమాలను ప్రేక్షకుల ముందుంచారు. అయితే అలా విడుదలైన, షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కాబోతున్న సినిమాల్లో కొన్ని సాంగ్స్ రికార్డులు తిరగరాస్తూ ఆన్‌లైన్ వేదికపై హంగామా చేశాయి. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి      


   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: