భక్తుల పాలిట కొంగు బంగారం....

గడివేముల లో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మూల పెద్దమ్మ అమ్మవారు

గడివేముల గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ మూల పెద్దమ్మ అమ్మవారు

(జానో -జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలం, గడివేముల గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ మూల పెద్దమ్మ అమ్మవారు భక్తుల కష్టాలు తొలగించి, వారి కోరికలను నెరవేర్చే తల్లిగా, నమ్మిన భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. గడివేముల లో వెలసిన శ్రీ శ్రీ శ్రీ  మూల పెద్దమ్మ అమ్మ వారి కి ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు నుండి వారం రోజుల పాటు అమ్మవారికి భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేర్చిన అమ్మవారికి మొక్కుబడులు చెల్లిస్తుంటారు.

దేవాదాయ శాఖ ఈవో ఏ నాగ ప్రసాద్

వారం రోజుల పాటు తిరుణాల,మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, మరియు వృషభ రాజుల ( ఎద్దుల ) బండ లాగుడు
 పందెములు  ఘనంగా నిర్వహిస్తారు. ఆలయంలో వాల్మీకి ( బోయ )సంఘం వారు అమ్మవారికి పూజారులు గా ఉండి  ప్రతి రోజు ధూప,దీప,నైవేద్యాలను,ఆకు పూజా, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి మంగళవారం,శుక్రవారం వివిధ గ్రామాల నుండి  భక్తులు కాలినడకన, ద్విచక్రవాహనాలపై,
భోజన సదుపాయాలనుు సద్వినియోగంంచేసుకుంటున్న్న భక్తులు 
ఆటోలు, బస్సుల ద్వారా విచ్చేసి  గడివేముల లోని శ్రీ శ్రీ శ్రీ మూల పెద్దమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అనేక మంది గడివేముల గ్రామానికి విచేస్తూ ఉంటారు. గడివేముల గ్రామానికి భక్తులు రావడానికి  రవాణా సౌకర్యం కూడా కలదు.నంద్యాల నుండి వచ్చే భక్తులు నందికొట్కూరు బస్సులను ఎక్కి గడివేముల గ్రామంలో దిగి అమ్మవారిని దర్శించుకుంటారు, అదేవిధంగా నందికొట్కూరు నుండి వచ్చే భక్తులు నంద్యాల బస్సు ఎక్కి గడివేముల  గ్రామంలో దిగి అమ్మవారిని దర్శించుకుంటారు. కర్నూల్ నుండి వచ్చే భక్తులు గడివేముల బస్సు ఎక్కి అమ్మవారిని దర్శించుకుంటారు.
ఆలయ ప్రాంగణంలో నిర్మించిిన ఉయ్యాల తొట్టిి
గత కొద్ది సంవత్సరాల క్రితం గడివేముల గ్రామం లోని శ్రీ శ్రీ శ్రీ మూల పెద్దమ్మ అమ్మవారి ఆలయం దేవాదాయ శాఖ వారి అధీనంలోకి వెళ్ళినప్పటి నుండి ప్రతి మంగళవారం వివిధ గ్రామాల నుండి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం మరియు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి సహకారంతో  గడివేముల మండల జెడ్ పి టి సి సభ్యులు ఆర్ బి, చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గడివేముల వాల్మీకి సేవా కమిటీ వారి సహకారంతో ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఆలయ ప్రాంగణంలో ఉచిత భోజన సౌకర్యం చేసేందుకు వీలుగా నంద్యాల మండలం, కొత్తపల్లి, గ్రామానికి చెందిన నక్క ఇల్లున్న గారి భార్య మరియమ్మ గారు లక్ష రూపాయలు వెచ్చించి ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డు నిర్మాణాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో విచ్చేసిన భక్తులకు మంచి నీటి కొరత లేకుండా JSW సిమెంట్ యాజమాన్యం వారు శుద్ధ నీటి జలాలను అందిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు దేవాదాయ శాఖ వారు కల్పిస్తున్న వసతులపై ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచేందుకు వారు తీసుకుంటున్న జాగ్రత్తలపై, వాహనాలను భక్తులకు ఇబ్బంది కలగకుండా  ఒకవైపున పార్కింగ్ ను ఏర్పాటు చేయడం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు, లేకుండా ఈవో ఏ, నాగప్రసాద్ తగిన జాగ్రత్తలు తీసుకోవడం పై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: