దుర్గమ్మను దర్శించుకున్న,,,
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ
(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సతీసమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్ద జస్టిస్ వెంకటరమణ దంపతులను రాష్ట్ర సమాచార పౌరసంబందాల శాఖామాత్యులు పేర్ని వెంకటరామయ్య (నాని) స్వాగతం పలికారు. జస్టిస్ వెంకటరమణ దంపతులను ఆలయ మర్యాదలతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు ఆలయ ఈ ఓ భ్రమరాంబ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు వెంకటరమణ దంపతులకు అర్చకులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేదపండితుల చే వెంకటరమణ దంపతులు లకు వేద ఆశీర్వచనం చేశారు అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని , తీర్ధ,ప్రసాదాలను అందజేశారు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వెంట ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణా హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ , తెలంగాణా హైకోర్టు జడ్జి లలిత కన్నెగంటి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణా హైకోర్ట్ రిజిస్ట్రార్లు , విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీమతి వాణిమోహన్, కమీషనర్ హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, నగర పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా, ప్రభృతులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?
ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: