ఇప్పటికే నలిగిపోయిన పేదలపై  మరో భారమా

ఆ ప్రతిపాదనలు  ఉప సంహరించుకోవాలి

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు  సయ్యద్  ముక్తార్ బాషా

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

ఇప్పటికే పలు  పన్నుల  భారాలతో సతమతమవుతున్న పేద, సామాన్య ప్రజలపై విద్యుత్  ఛార్జీలు స్లాబ్ లు  రూపంలో  మార్చుతూ మరో భారంమోప్పేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కాం)లు  సిద్దమవుడం శోచనీయమని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా విమర్శించారు. స్లాబ్ ల రూపంలో  విద్యుత్ ఛార్జీలు పెంపేందించే దిశగా విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కాం)లు ప్రతిపాదనలు ఏపీఇఆర్సీకి అందజేసినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.


ఈ ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే వైసీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఆయన  హెచ్చరించారు. రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటించిన వైపీపీ అధికారంలోకి వచ్చాక పన్నుల ప్రభుత్వంగా మారిందని ఆయన ఎద్దేవాచేశారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాల లబ్ధి ఏమేర ఉందో మోపుతన్న పన్నుల భారం ఏ మేర ఉందో తేల్చితే సామాన్యులు  ఎలా నలిగిపోతున్నారో అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: