మాస్టర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో,,,

            ఉచిత కుట్టుమిషన్ శిక్షణ             ముస్లిం మైనార్టీ నాయకులు మొహిద్దిన్

(జానో జాగో వెబ్ న్యూస్-ఒంగోలు  ప్రతినిధి)

ప్రకాశంజిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన పేదల కోసం మాస్టర్ ఇనిస్టిట్యూట్ వారు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఆ సంస్థ డైరెక్టర్, ముస్లిం మైనార్టీ నాయకుడు మొహిద్దిన్ ఓ ప్రకటనలో  తెలిపారు. మార్కాపురం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ఎగువ, దిగువ వర్గాలలోని   ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు మాస్టర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి తరువాత వారికి ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు గాను అభ్యర్థులు కనీసం 5వ తరగతి సర్టిఫికెట్ తోపాటుు ఆధార్ కార్డు, తెల్ల రేషెన్ కార్డు కలిగిన వారు అర్హులుగా తీసుకోవడం జరుగుతుందని మాస్టర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ సయ్యద్ మోహిద్దీన్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు 9247266858 ఈనంబర్ కి సంప్రదించాలని మోహిద్దీన్ తెలిపారు.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: