ఒక్కో ఇంటికి ఒక్కటే మీటరా
ఇదే విధానం...ఆ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలి
సీపీఐ నేత కె.రామకృష్ణ
(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)
ఒక్కో ఇంటికి ఒకటే మీటర్ ఉండాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు నోటీసులు ఇవ్వడాన్ని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి కార్యదర్శి కె రామకృష్ణ తపుపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....దశాబ్దాల కాలం నుండి ఒక ఇంటిలోని పోర్షన్ ల ఆధారంగా విద్యుత్ సంస్థలు మీటర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకే ఇంట్లో ఎన్ని పోర్షన్లు ఉన్నప్పటికీ ఓకే మీటర్ ఉంచి, మిగతావి రద్దు చేసుకోవాలని ఎలక్ట్రిసిటీ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ఫలితంగా మీటర్ రీడింగ్ విపరీతంగా పెరిగి, అత్యధికంగా విద్యుత్ ఛార్జీల భారం వినియోగదారులపై పడడం ఖాయం. అమ్మఒడి, వృద్ధాప్య, వితంతు పెన్షన్ లవంటి పలు సంక్షేమ పథకాల అమలును కరెంట్ బిల్లుతో ముడి పెట్టడం గమనార్హం. ఇప్పటికీ జగన్ సర్కార్ ఓటిఎస్ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ఉంది. ఇప్పుడు విద్యుత్తు మీటర్ల తొలగింపుతో ప్రజలపై గుదిబండ మోపేందుకు సిద్ధమైంది. సంక్షేమ పథకాలలో కోతలు విధించేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపే కుట్రలకు తెరతీసింది. తక్షణమే విద్యుత్ పంపిణీ సంస్థలు మీటర్ల రద్దు ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆయన డిమాండ్ చేశారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?
ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ రాబోతోంబది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: