ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ 

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చరవాణి ద్వారా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జన్మదినం నేపధ్యంలో మంగళవారం  ఆయనతో స్వయంగా మాట్లాడిన గవర్నర్ మంచి ఆరోగ్యంతో ఆనందకరమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. పూరి జగన్నాధ స్వామి, తిరుమల బాలజీ అశీస్సులతో నిండు నూరెళ్లు ప్రజాసేవలో తరించాలన్నారు. చైతన్యవంతమైన నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింతగా సేవ చేయాలని, రాష్ట్రాన్ని పురోగతి వైపు పయనింపచేయాలని గవర్నర్ తన శుభాకాంక్షల సందర్భంగా సిఎంకు సూచించారు. జనావళి శ్రేయస్సు కొలమానికగా వ్యవహరించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: