సుబ్బారావు గుప్తా పై...

 జరిగిన దాడిని పట్ల బీజేపీ ఖండన

(జానో -జాగో వెబ్ న్యూస్_ఒంగోలు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా  ఒంగోలునగరానికి చెందిన ఆర్యవైశ్య సోదరుడు సుబ్బారావు గుప్తా పై వైసీపీ పార్టీ చెందిన నాయకుడు సుభాని అతని అనుచరులు వికృత చేష్టలతో చేసిన దాడిని బీజేపీ త్రివంగా ఖండితుందని బీజేపీ మైనారిటీ మోర్చా ఫార్మేర్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్. ఖలీఫాతుల్లాబాషా అన్నారు. బుధవారం నాడు ఉదయం సోదరుడు సుబ్బారావు గుప్తా నివాసానికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన ఆర్యవైశ్య కులస్థులనే  కాదు,హింసారహిత రాజకీయాలను కోరుకునే వారందరి మనోభావాల్ని దెబ్బతిందన్నారు.


ఆరోగ్యముగా ఉన్న సుబ్బారావు గుప్తా మానసిక పరిస్థి బాగాలేదని వైసీపీ నేతలు చెప్పడం సబబేనా అంటూ హాస్యాస్పదంగా ఉందన్నారు.భయభ్రాంతులకు గురి అయిన సుబ్బారావు గుప్తా భార్య పిల్లలు తమకు ప్రాణహాని ఉందని  దాడిచేసిన వారి నుంచి తమను రక్షించాలని రోధించారు.బీజేపీ జాతీయ నాయకులు రాజ్యసభ సభ్యులు జీవియల్ నరసింహారావు ఈ సంఘటనను ఖండిస్తూ సుబ్బారావు గుప్తా ని ఫోన్లో మాట్లాడి అండగా ఉంటామని దోషాలను కఠినంగా శిక్షించాలని డిజిపి గారితో మాట్లాడతామని అవసరమైతే కేంద్ర హోం శాఖ మంత్రి పెద్దలు అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్లాతమని పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా ఎస్పీ గారు వెంటనే సుబ్బారావు గుప్తా పై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి సుబ్బారావు గుప్తా కుటుంబానికి రక్షణా కల్పించాలని కోరారు.





            


 


    


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: