మైనారిటీ కమిషన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లకు,,,

పాలక మండళ్ళను వెంటనే నియమించాలి

ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

మైనారిటీల సమస్యలను కనీసం విని, విచారించడానికి మైనారిటీ కమిషన్ కు, ఆర్థిక సహాయం గురించి అడిగితే పట్టించుకునే ఫైనాన్స్ కార్పొరేషన్ లకు పాలక మండళ్లు లేకపోవడం అన్యాయం, వాటిని వెంటనే నియమించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా, గజ్వేల్ లో ఆవాజ్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆవాజ్ సిద్దిపేట జిల్లా నాయకులు అహ్మద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనారిటీల సమస్యలను వినే నాధుడే లేకుండా పోయాడని, కనిసం మైనారిటీ కమిషన్ కు చెప్పుకుందామంటే కమీషన్ చైర్మన్, సభ్యులు లేరని విమర్శించారు.  కోవిడ్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన పేద మైనార్టీలను ఆదుకునేందుకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో నిధులు లేవు ఆ కార్పొరేషన్ చైర్మన్ లేరు, సభ్యులు లేరు.


ఇక దేనికోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని ప్రశ్నించారు. ఉర్దూ రెండవ అధికార భాష అన్నారు కానీ ఉర్దూ అకాడమీకి నిధులు లేవు, పాలక మండలి లేదు. మైనారిటీల అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని కార్పోరేషన్లకు, కమీషన్లకు చైర్మన్లను, సభ్యులను నియమించిన కేసిఆర్ కు మైనారిటీ సంస్థల ఖాళీలు, నిధుల లేమి కనపడక పోవడం విడ్డూరం. వెంటనే ఆ సంస్థలకు పాలకమండళ్ళను నియమించాలి. నిధులు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో మహమ్మద్ అమ్మద్, ఇదాయత్ అలీ, యూసుఫ్, షఫీ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి      


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: