సీఎం పర్యటన ..
తణుకు లో చురుగ్గా సభావేదిక ఏర్పాటు
పర్యవేక్షణ చేస్తున్న ఎమ్మెల్యే కారుమూరి, ఆర్డీవో మల్లిబాబు
(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)
ఈ నెల 21 మంగళవారం జగనన్న సంపూర్ణ భూమి హక్కు పధకం రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని శాసనసభ్యులు డా.కారుమూరి నాగేశ్వరరావు, ఆర్డీవో ఎస్.మల్లిబాబు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచే స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎండకు, వానకు ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ షేడ్స్ , గ్రౌండ్ లెవెలింగ్ పనులు చురుగ్గా చేపడుతున్నా మన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దే పనుల్లో ఉన్నామని తెలిపారు.తణుకు జెడ్పి హై స్కూల్ ప్రాంగణా నికి డిసెంబర్ 21 హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ జరిగే వేదిక వరకు ముఖ్యమంత్రి వర్యులకు నియోజకవర్గ, జిల్లా ప్రజలు, పార్టీ కార్యకర్తలు , రహదారికి ఇరు వైపులా నిలిచి ఘన స్వాగతం పలకడం జరుగుతుందని శాసన సభ్యులు తెలిపారు.
కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ గత మూడు రోజులు గా తణుకు లోనే ఉంటూ సీఎం పర్యటన పనులను వ్యక్తి గతంగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రూట్ మ్యాప్ మేరకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్డీవో మల్లిబాబు తెలిపారు. రెవెన్యూ, ఆర్ అండ్ బి, మునిసిపల్, హౌసింగ్, పోలీసు తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వారి సూచనలతో పనులను పర్యవేక్షణ చేస్తూ, నివేదిక ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్ కె ఎస్ మహిళా కళాశాల ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చెయ్యడం జరిగిందని తెలిపారు. సభా ప్రాంగణంలో కూడా మ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డీవో మల్లిబాబు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంపూర్ణ గృహ హక్కు పధకాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభిస్తూన్న దృష్ట్యా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు. సభా ప్రాంగణంలో భూమి లేవిలింగ్ పనులు దాదాపు పూర్తి అయినట్లు, సభా వేదిక పనులు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు.
Home
Unlabelled
సీఎం పర్యటన .. తణుకు లో చురుగ్గా సభావేదిక ఏర్పాటు -- పర్యవేక్షణ చేస్తున్న ఎమ్మెల్యే కారుమూరి, ఆర్డీవో మల్లిబాబు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: