నూతన సంవత్సర క్యాలెండర్ విడుదల చేసిన... 

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్

(జానో -జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం లోని గని గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు డి.వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై మరియు ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఏపిటిఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని, ఆయన పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్.మహబూబ్ బాషా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ.వి,నారాయణరెడ్డి టీచర్ల సమస్యలు పరిష్కరించండి అని ప్రభుత్వానికి ఎలుగెత్తి చాటడంతో  అతని ని సస్పెన్షన్ చేయడం ఎంత వరకు సమంజసమని, సస్పెన్షన్ చేసినంత మాత్రాన ఉద్యమాలను అణచివేయలేరని, ఇది సరైన పద్ధతి కాదని, వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3 4 5 తరగతుల ను విలీనం చేసే ప్రక్రియను కూడా తక్షణమే ఆపివేయాలనీ, పిఆర్సి ప్రక్రియను వేగవంతంగా అమలు చేసి 55% ఫిట్మెంట్ ను ప్రకటించి,అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గని ఉపాధ్యాయులు ఐ.సుకన్య, ఆర్.శేషుమనీ రాజు, జి. పుల్లయ్య, ఎం,లక్ష్మయ్య. వసంత్ నాయక్ , సుబ్బరాయుడు, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: