కర్నూలు జిల్లా ప్రజలకు...

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి గుమ్మనూరు జయరామ్


(జానో జాగో వెబ్ న్యూస్-ఆలూరు ప్రతినిధి)

ఆలూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆయన సోదరులు దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు ఆలూరు నియోజకవర్గం వైయస్సార్ సిపి పార్టీ ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి మరియు ఎం పి పి బూర్ల సుభాషిణి, జెడ్ పి టి సి ఏరూరు శేఖర్, తదితరుల సమక్షంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని, కర్నూలు జిల్లా ప్రజలకు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమా గుణం..ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని వారు పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు లభించాలనివారు ఆకాంక్షించారు.క్రిస్మస్ వేడుకలను ఆనందంగా, సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు. రానున్న నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ, సంతోషాలతో అందంగా జీవించేలా ప్రభువు దీవెనలు అందించాలని ఆకాంక్షించారు.


కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ప్రజలందరూ తారతమ్యాలు లేకుండా సమానతత్వంతో, సోదరభావంతో జీవించాలనే ఏసుక్రీస్తు బోధనలు మనకు ఆదర్శమని చెప్పారు. ప్రభువు ఆశీర్వదాంతో మన జిల్లా అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: