సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది

సీజేఐ ఎన్‌వీ రమణ

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినధి)

రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాలలో ఆదివారం ఉద‌యం జ‌రిగిన దివంగత జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాస సభలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన విద్యతోనే యువతకు మంచి భవిష్యత్తు అని జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు నమ్మేవారని చెప్పారు. స్వగ్రామంలో గ్రంథాలయాన్ని స్థాపించారని.. వాలీబాల్‌ తదితర క్రీడలను ఆయన ప్రోత్సహించేవారని పేర్కొన్నారు. జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు ఆద‌ర్శాలు ఆయన తనయుడు జస్టిస్‌ లావు నాగేశ్వరరావుకు స్ఫూర్తి అయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా ‘భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు’ అనే అంశంపై సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రసంగించారు. స్వాతంత్ర్యం తర్వాత అభివృద్ధి, ఆధునీకరణ, పారిశ్రామికీకరణ వైపు మళ్లడంలో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. ‘‘ఎన్నో సవాళ్లు మన ముందున్నాయి. 1990లో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. సరైన సమయంలో సరైన నిర్ణయంతో దాన్ని అధిగమించాం. ఆ తర్వాత కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. న్యాయవ్యవస్థ కూడా ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది. రాజ్యాంగ పరిరక్షణలో కీలకపాత్ర పోషించింది’’ అని పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  


 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: