మాస్క్ లేకుండా బయటకు వస్తే..

జరిమానా విధించండి 

ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఆదేశం

(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం,పొదిలి,కొనకనమిట్ల, మండలాలలో కలెక్టర్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. మార్కాపురం పట్టణములోని అయ్యప్ప స్వామి గుడి సెంటర్లో కలెక్టర్ పలు దుకాణాల వద్ద మాస్కు లేకుండా సంచరిస్తుండటంతో వారిని కలెక్టర్ నిలదీశారు. ప్రధాన కూడలిలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మార్కాపురంలోని గృహనిర్మాణ శాఖ నిర్మిత కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.


అలాగే పొదిలి పట్టణం పాత బస్టాండ్ సెంటర్లోనూ ఆయన ఆకస్మికంగా పర్యటించారు. మాస్క్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న దుకాణాదారులు, పండ్ల వ్యాపారులను నిలదీశారు. 

కోవిడ్ మూడవ దశ హెచ్చరిక  ఉన్నప్పటికి నిర్లక్ష్యంగా ఉండటం మంచి పద్దతి కాదని ప్రజలను ప్రశ్నించారు. మాస్క్ లేకుండా వ్యాపారం నిర్వహించే షాపులను తక్షణమే మూత వేయాలని కలెక్టర్ ఆదేశించారు. మాస్క్ ధరించకుండా దుకాణాలలోకి ప్రజలను అనుమతించరాదన్నారు. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ బారి నుంచి తప్పించుకోవడానికి మాస్క్ ధరించడం, శానిటైజేషన్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి విస్మరించరాదన్నారు. టీకా కార్యక్రమం 45 సంవత్సరాలు దాటిన వారందరికి వేయాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చైతన్య పరచాలన్నారు. మండల టాస్క్ ఫోర్స్ కమిటీలు కఠినంగా వ్యవహరించాలన్నారు.

 

ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్
నిబంధనలు ఉల్లఘించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పన్నుల అక్రమాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. కొనకనమిట్ల గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన దస్త్రాలను ఆయన పరిశీలించారు. స్ధానికులు ఫిర్యాదు ఇవ్వడంపై కలెక్టర్ స్పందించి ఎమ్.పి.డి.ఓ., తహసిల్దార్ ని పిలిపించి ఆరాతీశారు. వాలంటీర్ ఒకరు, పంచాయతీ కార్యదర్శి కలిసి రూ.70వేలు ఇంటి పన్నులకు సంబంధించిన నగదు కాజేశారని కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అవినీతి జరగడం వాస్తవమేనని అధికారులు కలెక్టరు దృష్టికి తీసుకురావడంతో, తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఘటనపై విచారణ జరపాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. 

ఈ కార్యక్రమంలో ఆయన వెంట మార్కాపురం కమీషనర్ నయీమ్ అహ్మద్, పొదిలి తహసిల్దార్ దేవప్రసాద్, ఎమ్.పి.డి.ఓ. శ్రీకిృష్ణ, హౌసింగ్ డి.ఇ.పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ రాబోతోంబది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి




     

      

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: