ఈద్గా.. స్మశాన వాటిక కబ్జాకు నిరసనగా...

కందుల నారాయణ రెడ్డి నాయకత్వంలో నిరసన

(జానో -జాగో వెబ్ న్యూస్_తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా  మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు  మండలంలోని తుమ్మలచెరువు  గ్రామంలో గల గత నలభై సంవత్సరాలుగా గ్రామ ముస్లిం సోదరులు 3.85 ఎకరాల భూమిని ఈద్గా గా మరియు స్మశానవాటికగా ఉపయోగించున్న భూమిని కొందరు భూబకాసురులు బోగస్ పట్టా పొంది భూకబ్జా చేసిఉన్నారు. దీనికి నిరసనగా తర్లుపాడు మండల కేంద్రంలో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మండల ముస్లిం సోదరులు  తర్లుపాడు సెంటర్లో   రోడ్డు పై బైటాయించి తమ నిరసన తెలియ జేశారు.


ఈ సందర్బంగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుండి మార్కాపురం నియోజకవర్గంలో వందలాది ఎకరాల భూకబ్జాల పర్వం కొనసాగుతున్నదని చివరకు ముస్లింల ఈద్గా మరియు స్మశాన వాటికల ను కూడా వైసీపీ నాయకులు వదలడం లేదని తుమ్మలచెరువు గ్రామంలో కబ్జాదారులు ఆక్రమించిన  ఈద్గా స్థలానికి తక్షణమే బోగస్ పట్టా రద్దు చేసి ముస్లిం సోదరులకు ఈద్గా మరియు స్మశాన వాటికకు పట్టా జారీ చెయ్యాలి అని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సుమారు  రెండు గంటల పాటు మార్కాపురం మాజీ శాసనసభ్యుల వారు రోడ్డుపై క్రింద కూర్చొని నిరసన తెలియజేసారు. స్పందించిన తర్లుపాడు మండల తహసీల్దార్ గారు విచ్చేసి బోగస్ పట్టాను రద్దు చేసి తుమ్మలచెరువు  గ్రామ  ముస్లిం సోదరులకు ఈద్గా మరియు స్మశాన వాటికకు  పట్టా జారీ చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమం  ముగించడం జరిగింది. 

కార్యక్రమంలో  తుమ్మలచెరువు ముస్లిం సోదరులు మరియు తర్లుపాడు మండలంలోని వివిధ గ్రామాల ముస్లిం సోదరులు మరియు తర్లుపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, మార్కాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామానుజల రెడ్డి,, పొదిలి మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ మైనారిటీ సెల్  అధ్యక్షులు షేక్ రసూల్, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ tnsf ప్రధానకార్యదర్శి షేక్ గౌస్ బాషా, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పుచ్చనూతల గోపినాధ్, కాళంగి శ్రీనివాసులు, సాదం వీరయ్య, మార్కాపురం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సయ్యద్ గఫర్ ,  తర్లుపాడు మండల ముస్లిం నాయకులు షేక్ నాగూర్ మీరావలి, షేక్ దాదా వలి, సయ్యద్ కరీం, సయ్యద్ రసూల్ ,  షేక్ ఖాసిం వలి, సయ్యద్ మహబూబ్  వలి, షేక్ ఖాసిం వలి తదితరులు మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.


        


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: