అందాల పోటీలు ఆత్మస్థైర్యాన్నిపెంచుతాయి....

సినిమారంగానికి రాచబాటలు వేస్తాయి!!

మాజీ కేంద్రమంత్రి...తెలంగాణ ప్రభుత్వ సలహాదారు

సముద్రాల వేణుగోపాలచారి

(జానో జాగో వెబ్  న్యూస్-సినిమా బ్యూరో)

యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్కై జాయింట్ వెంచర్స్ డ్రీమ్ మేకర్స్ ప్రొడక్షన్స్ తో కలిసి "మిస్టర్ అండ్ మిస్ ఏషియా" ఈవెంట్ నిర్వహిస్తోంది. మిస్టర్ & మిస్ ఆసియా మోడల్ 2021-22 సెలెక్షన్స్ బంజారాహిల్స్  రోడ్ నెంబర్ 10 లోని  అట్లాస్ అపార్టుమెంట్  రెండవ ఫ్లోర్ లో నిర్వహించనున్నారు. ఇందులో ఎంపిక అయినవారు ఫినాలే లో తమ ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. ఇక ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ ను మాజీ మంత్రి మరియు తెలంగాణ విద్యుత్ మరియు వ్యవసాయ శాఖ సలహాదారు డా.వేణుగోపాలచారి గారు లాంచ్ చేశారు. అందాల పోటీలు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయని, పాపులారిటీకి, సినిమా రంగానికి రాచబాటలు వేస్తాయని వేణుగోపాలచారి పేర్కొన్నారు. మిస్టర్ అండ్ మిస్ ఆసియా పోటీలకు హైద్రాబాద్ వేదిక కావడం గర్వకారణమన్నారు. ప్రముఖ సినీ దర్శకులు, నటులతో పాటు ప్రముఖ నృత్య దర్శకులు సలీం ఇలాహి వంటి ఇండియన్ సినిమా కు చెందిన ప్రముఖులు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారని మిస్టర్ అండ్ మిస్ ఆసియా నిర్వాహకురాలు-ప్రముఖ నటి ప్రియాంష దూబే తెలిపారు.


ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఢిల్లీ, చండిఘర్, భోపాల్, లక్నో, పూనే, బెంగళూరు వంటి ప్రముఖ పట్టణాల నుంచి 1000కి పైగా ఎంట్రీలు వచ్చాయని. జనవరి 30, 2022న జరిగే ఫైనల్స్ కి మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖాండేవాల్ మరియు మిస్టర్ ఇండియా స్టైల్ ఐకాన్ లక్ష్య శర్మ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారని ఆమె వివరించారు.

స్కై జాయింట్ వెంచర్స్ సహ వ్యవస్థాపకురాలు, ప్రముఖ నటి మిస్ ప్రియాన్షా దుబే  మరియు డ్రీమ్ మేకర్స్ ప్రొడక్షన్స్ ఎమ్.డి మీర్జా ఇంతియాజ్ బేగ్ తమ సంస్థలు యువతను ప్రోత్సహించడానికి ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మిస్టర్ & మిస్ ఆసియా మోడల్ 2021-22 ఫైనల్స్ లో 100 మంది ప్రతిభావంతులైన యువత పాల్గొంటారని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: