ఈ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం...

ప్రజలంతా  వైసిపి పాలన అంటే విసుగుచెందారు..

బీజేపీ నేత సోమువీర్రాజు

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

ఈ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని, ప్రజలంతా  వైసిపి పాలన అంటే విసుగుచెందారని బీజేపీ నేత సోమువీర్రాజు విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వరు ఉన్న ఉద్యోగులకు జీతం  ఒక అందని ద్రాక్షగా మారిందని ఆయన విమర్శించారు. బడుగులంటే  ఈప్రభుత్వానికి చులకనగా మారిందని,  కేవలం కేంద్ర పధకాలకు పేర్లు మార్చుకుని  కాలం వెళ్లదీసే ప్రభుత్వంగానే ప్రజలకు కనపడుతోందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. ప్యాలెస్ పరిపాలనలో ప్రజల సమస్యలు వినే నాధుడే లేడు, అనేక సమస్యల పై ముఖ్యమంత్రికి లేఖలు రాయడం జరిగింది అయినా స్పందనలేదు, ఈ ప్రభుత్వానిది తోలు మందం వ్యవహారంలా ఉంది, అభివ్రుద్ది శూన్యం, మత్య్సకారులకు సంబంధించి 217 జిఓ పై భారతీయ జనతాపార్టీ మాత్రమే స్పందించి నెల్లూరు జిల్లాలో  మత్య్సకార గర్జన సభ పెట్టడం జరిగింది. 50వేల కోట్ల తో కేంద్ర ప్రభుత్వం ఎపిలో జాతీయ రహదారుల అభివృద్ధి చేశాం ఈ ప్రభుత్వం చిన్న గుంతకూడా పూడ్చలేదు. ఫ్యామిలీ పార్టీలది అవినీతి లక్ష్యం, ఇది హిందువుల వ్యతిరేక ప్రభుత్వం, దీనిపై దమ్ముంటే చర్చ కు రండి, సహకార రంగంలో పంచదార మిల్లులు  అమ్మేయలేదా.,


ఇదే విషయం జగన్ ,చంద్రబాబు చర్చ కు సిద్దమా, హిందువులు సామూహికంగా నిర్వహించుకునే వినాయక చవితి పండుగలాంటి వచ్చిన సందర్భంలో  ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై  బిజెపి మాత్రమే రోడ్డు ఎక్కి పోరాటాలు చేశాం. అన్ని రాష్ట్రాల్లో కేంద్రం తో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తే  వైసిపి ప్రభుత్వం ధరలు తగ్గించడం మాని ఎందుకు ధరలు తగ్గించాలంటూ లక్షలు కుమ్మరించి  పత్రికల్లో యాడ్స్ ఇచ్చిన వైనం పరిశీలిస్తే  ఇదొక సైకో ప్రభుత్వంగా ప్రజలకు కనపడుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు నెలజీతం దినదిన గండంగా మారిన పరిస్థితి వైసిపి ప్రభుత్వంలో నే చూస్తున్నాం, బిసి గణన అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు  దఖలు పరుస్తు 127 రాజ్యంగ సవరణ ద్వారా  కేంద్ర దఖలు పరిస్తే బిసి గణన చేయడానికి ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పారిశుధ్య కార్మికులకు జీతాల బకాయిలు గురించి రోడ్డెక్కే పరిస్థితి. ప్రక్రుత్రి  వైపరిత్యాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఇంతవరకు ఆదుకోలేదు.  అర్భన్ హెల్త్ సెంటర్లలో  20 సంవత్సరాల నుండి పని చేస్తున్న సిబ్బందిని తొలగించారు  వీరంతా ఆరోగ్య మంత్రి చుట్టు తిరిగినా ఇంతవరకు ఫలితం లేని పరిస్థితి ఏర్పడింది. గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న  ఉద్యోగులకు పేస్కేల్ ఎందుకు వర్తింప చేయరు  ఈ ప్రభుత్వాన్ని  ఎన్ని సార్లు అడగాలి. ఏ సమస్యపైనా కూడా ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడరు  కేవలం సలహాదారులు మాత్రమే మాట్లాడతారు .

ప్రజాస్వామ్యం ద్వారా అధికారంలోకి వచ్చినట్లు  వైసిపి భావించడం లేదు కేవలం ఈ రాష్ట్రాన్ని లీజుకు తీసుకున్నట్లు గా వీరి వ్యవహారం కనపడుతోంది. అసెంభ్లీలో  అధికార పార్టీ ఎమ్మెల్యేల భాష పరిశీలించిన వారెవరికైనా   ఈ విధంగానే అర్ధం అవుతోంది. రాయలసీమలో భూబకాసురల జోలికి ప్రభుత్వం ఎందుకు వెళ్లడంలేదు. మహిళలకు రక్షణ లేదు పట్టపగలు మహిళల పై దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి, ఈ ప్రభుత్వం పై విమర్శలు చేసిన వారిపై దాడులు, కేసులు పెట్టడమే ఈ ప్రభుత్వ ధ్యేయంగా కనపడుతోంది. ఎర్రచందనం, ఇసుక మాఫియా ల వ్యవహారంలో ప్రభుత్వం  ప్రజలకు ఎందుకు జవాబుదారీగా ఉండడం లేదు. ఈ తోలు మందం ప్రభుత్వానికి తోలు పలచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది.


ప్రజలంతా ఈ ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్నారు. ప్రజల నిరసన వాణిని  భారతీయజనతా పార్టీ  ఈ నెల 28వ తేదీన బహిరంగ సభద్వారా తెలియచేయాడానికి కార్యచరణ రూపొందించాం. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం తప్పులు లెక్కలు గట్టాం, ప్రభుత్వంలో మార్పు తీసుకు రావడానికి  నిరసన కార్యక్రమాలు నిర్వహించాం అయితే  ఈ శాడిస్ట్ ప్రభుత్వానికి మార్పు రాదని భావించి  ప్రజల గొంతుకను బిజెపి భహిరంగ సభ ద్వారా  వినిపిస్తాం. ఈ ప్రభుత్వం పై దండెత్తడానికి బిజెపి  నిర్ణయం తీసుకుంది  ఆదిశగానే అడుగులు వేయడానికి  బహిరంగ సభ వేదికగా  మా కార్యచరణ ప్రకటిస్తాం. అని సోమువీర్రాజు వెల్లడించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: