నాబార్డ్ సంస్థ వారి ఆధ్వర్యంలో...

డిజిటల్ ఆర్థిక లావాదేవీల పై అవగాహన సదస్సు

(జానో -జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా,పాణ్యం నియోజకవర్గం,గడివేముల మండలంలోని పెసరవాయి గ్రామంలో నాబార్డ్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వారు డిజిటల్ మరియు ఆర్థిక లావాదేవీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ నాడు ఆర్థిక లావాదేవీల కోసం ప్రతి ఒక్కరు బ్యాంకులో వద్దకు వచ్చి బారులు తీరి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఆర్థిక లావాదేవీలు జరుపుకునేవారు, కానీ ప్రస్తుతం నేటి సమాజంలో అన్ని ఆర్థిక లావాదేవీలు సెల్ఫోన్లద్వారా  ఫోన్పే, ఏటీఎం, ద్వారా  పేటీఎమ్, ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని కావున గ్రామాలలోని ఖాతాదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

అవగాహన కల్పిస్తున్న ఆంధ్ర ప్రగతి బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున రెడ్డీ

అంతేకాకుండా ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమాను 330 రూపాయలు చెల్లించి 18 సంవత్సరాల నుండి 59సంవత్సరాల  లోపు వారు తీసుకున్న వారు  సహజ మరణం చెందితే వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలను అందజేయడం జరుగుతుందని, జీవన సురక్ష పథకం 12 రూపాయలు చెల్లించి బీమా ను తీసుకుంటే రహదారి ప్రమాదాలు, అనుకోని సంఘటనల వలన ప్రమాదాలు జరిగి చనిపోయిన కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

హాజరైన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు లబ్ధిదారులు

అనంతరం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతాదారులకు ఏటీఎం కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది విష్ణు తేజ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, గ్రామీణ మిత్ర సభ్యులు రాజేష్, సతీష్ కుమార్, బ్యాంకు సిబ్బంది శ్రీనివాసులు, శ్రీకాంత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: