నోటికొచ్చినట్టు హామిలిచ్చి...ఇపుడు మోసం చేస్తారా...? 

-కింజరాపు అచ్చెన్నాయుడు 

 

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

నోటికొచ్చినట్టు హామిలిచ్చి...ఇపుడు మోసం చేస్తారా...? అని టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బ్రిటిష్ వారి నియంత పాలన గురించి చరిత్రలో చదువుకున్నాం తప్ప ప్రత్యక్షంగా చూడలేదు, కానీ జగన్ రెడ్డి పుణ్యమా అని ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆ అవకాశం దక్కింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారికి ఆంక్షలు, సంకెళ్లు విధిస్తూ జగన్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారు. ఆయన పాలన బ్రిటిష్ పాలన 2.0 మాదిరి ఉంది. అమరావతి రైతుల మహాసభకు కోర్టు అనుమతిచ్చినా.. ప్రజలు సభకు వెళ్లకుండా ఎక్కడిక్కడ వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోంది.మరో వైపు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల నిరవధిక దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు, ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. ఆంక్షలతో అడ్డుకోవటం ఏంటి? ఇదెక్కడి ప్రజాస్వామ్యం..?  జగన్ రెడ్డి  3 రాజధానులు కడతానని చెప్పి 3 సంవత్సరాలు కావొస్తోంది, ఇప్పటివరకు 3 ప్రాంతాల్లో కనీసం 3 ఇటుకలు కూడా పేర్చలేదు, తప్పుడు ప్రచారంతో అమరావతిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ కి తీరని నష్టం చేకూర్చారు. అమరావతే రాజదానిగా కావాలంటూ రైతుల చేస్తున్న పాదయాత్రను అడగడుగునా అవమానిస్తూ..అడ్డంకులు కల్పించినా..‎ రైతుల పాదయాత్ర విజయవంతం కావడంతో జగన్ రెడ్డి, వైసీపీ నేతలు కడుపు మంటతో బాధపడుతున్నారు.


అందుకే తిరుపతి అమరావతి బహిరంగ సభకు కోర్టు అనుమతిచ్చినా.. ఎక్కడిక్కక అడ్డంకులు సృష్టిస్తూ ఆటంకాలు కల్పిస్తున్నారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయమన్నందుకు అన్యాయంగా అరెస్టు చేయటం సిగ్గుచేటు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పోలవరం నిర్వాసితులు 10 రోజుల నుంచి నిరవదిక దీక్ష చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గ్రామాలలో పర్యటించి, ‎ ఓట్ల కోసం అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావొస్తోంది, ఈ 3 ఏళ్లలో పోలవరంలో ఏ పనులు చేశారో, పోలవరం నిర్వాసితులకు ఏం న్యాయం చేశారో మంత్రి, ముఖ్యమంత్రి చెప్పగలరా? మీ చేతకానితనం, అసమర్ధతతో రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి. ముఖ్యమంత్రికి టీడీపీ నేతల్ని అక్రమంగా అరెస్టులు చేయటంపై ఉన్న శ్రద్ద రాష్ట్రాభివృద్దిపై లేకపోవటం బాధాకరం.

ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా ఉంటున్న టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టులు, అక్రమ కేసులతో అడ్డుకోవాలనువటం మూర్కత్వం. మీరు ఎంతమందిని హౌస్ అరెస్టులు చేసినా, ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. జగన్ రెడ్డి ఇప్పటికైనా పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించి, పునరావాసంలో మౌలిక వసతులు కల్పించాలి. అక్రమంగా హౌస్ అరెస్టు చేసిన టీడీపీ నేతల్ని విడుదల చేయాలి. అని ఆయన డ డిమాండ్ చేశారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: