నా జీవితంలో ఇదే బిగ్గెస్ట్ మిస్టరీ

(జానో జాగో వెబ్  న్యూస్-సినిమా బ్యూరో)

అంశం ఏదైనా తనదైన శైలీలో  సెటైర్లు వేయడం, వేయించుకోవడం  సంచలన  దర్శకుడు  రామ్ గోపాల్ వర్మకు అలవాటే. తాజాగా ఆయన  ఓమిక్రాన్ ను సైతం వదలలేదు.  ఓమిక్రాన్ నియంత్రణ కోసం నైట్ కర్ఫ్యూను  పలు రాష్ట్రాలు విధించడంపై ఆయన చలోక్తులు విసిరారు.  ఓమిక్రాన్ కేసులు పెరగడంతో తాజాగా పలు రాష్ట్రాల్లో విధించిన నైట్ కర్ఫ్యూపై స్పందిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు రామ్ గోపాల్ వర్మ. దీనిపై ట్విట్టర్ వేదికగా తనదైన స్టైల్ రియాక్షన్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. ''రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విదిస్తే వైరస్ వ్యాప్తి తగ్గుతుందా? నా జీవితంలో బిగ్గెస్ట్ మిస్టరీ అంటే ఇదే'' అంటూ ప్రభుత్వాలపై పరోక్షంగా సెటైర్స్ వేశారు వర్మ. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్స్ 'వావ్.. గుడ్ లాజిక్ వర్మ' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఆయనపైనే తిరిగి కౌంటర్లు వేస్తున్నారు.  ఇక దీనిపై ''వైరస్ నిద్రపోకుండా నైట్ మొత్తం పోలీసులు కాపు కాస్తారు.. కాబట్టి పగలు వైరస్ నిద్రపోయి స్ప్రెడ్ అవ్వకుండా పడుకుంటుందని ప్రభుత్వాల నమ్మకం. ఈ మాత్రం తె‌లీకుండా క్రియేటివ్ ఫీల్డులో ఎలా ఉన్నారండీ బాబు'' అంటూ వర్మ ట్వీట్‌పై ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ పలు చర్చలకు తెరలేపింది. ఇదిలావుంటే కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో విలవిల్లాడిపోయిన భారతదేశాన్ని మరోసారి ఒమిక్రాన్ రూపంలో వణికిస్తోంది. కరోనా వైరస్. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు ప్రజల్లో ఆందోళన నింపుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ సూచనలతో పలు రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను కఠినతరం చేశాయి. మహారాష్ట్ర సహా హర్యానా, గుజరాత్, యూపీ, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆదేశాలు జారీ చేశాయి.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి      


   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: