జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక ) ఆధ్వర్యంలో,,,,
ఘనంగా మైనారిటీ హక్కుల దినోత్సవం
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక) సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మైనార్టీ దినోత్సవం జరిగింది. జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మైనార్టీ హక్కుల గురించి ప్రస్తావన సాగింది. ఈ సందర్భంగా జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడుతూ... భారతదేశంలో మైనార్టీల హక్కులు కాలరాయబడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారరు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దళితులు, ముస్లింలు, మైనార్టీలపై దాడులు పెట్రేగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు చూస్తూ చోద్యం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ముస్లింలకు చెందిన లక్షలాది ఎకరాల భూమి అన్యాక్రాంతమైన ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో కూడా 70 ఎకరాల వక్ప్ భూమి ఆక్రమణకు గురైందని విమర్శలు వస్తున్నా అధికార్లు చూస్తూ చోద్యంచేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని వక్ప్ బోర్డుకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అల్ప సంఖ్యాకులకు (Minorities) తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడం మైనారిటీ హక్కుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం మైనారిటీలకు సంబంధించిన సమస్యలతో పాటు రాష్ట్రంలో వారి భద్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మైనారిటీల హక్కుల దినోత్సవం సందర్భంగా వివిధ సెమినార్లు, ప్రచారాలు కార్యక్రమాలు నిర్వహించాల్సిన అనవాయితీ ఉందన్నారు.
1993 నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18వ తేదీని మైనారిటీ హక్కుల దినోత్సవంగా జరుపుకొంటున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. మతం, భాష, జాతీయత, జాతి ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా ప్రజల పట్ల వివక్ష చూపడాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి 1992 డిసెంబర్ 18 న మైనారిటీల హక్కుల ప్రకటన చేసిందని ఆయన పేర్కొన్నారు. మన దేశంలో మన భారత రాజ్యాంగం అల్ప సంఖ్యాక వర్గం అనే పదాన్ని నిర్దిష్టంగా నిర్వచించనప్పటికీ మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల గురించి ప్రస్తావించిందని చెప్పారు. భారత ప్రభుత్వం అల్ప సంఖ్యాక వర్గాల కోసం జాతీయ మైనారిటీ కమిషన్ చట్టంను 1992 ను రూపొందించిందన్నారు.
ఈ చట్టంలోని సెక్షన్ 2(C) కింద భారతదేశంలో ముస్లింలు,) సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు మైనార్టీలుగా పరిగణించబడతారని ఆయన పేర్కొన్నారరు. భారతదేశంలో మైనారిటీలు 2011 జనగణన ప్రకారం మొత్తం జనాభాలో 19% ఉన్నారని, 2006 జనవరి 29 న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నుంచి మైనారిటీలను వేరుచేసి వారికి ప్రభుత్వ విధానాలు, చేరువయ్యేలా ప్రత్యేకంగా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు కోట్ల ఖలీల్, మహాదేవపురం మదర్ కొట్టాల నజీర్, కాకరవాడ జలీల్ తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక ) ఆధ్వర్యంలో,,,, ఘనంగా మైనారిటీ హక్కుల దినోత్సవం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: