సమాజసేవలో  జర్నలిస్టుల భాగస్వామ్యం,,

అభినందనీయం

ఉచిత అంబులెన్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి

(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

సమాజసేవలో జర్నలిస్టులు భాగస్వాములు కావడం అభినందనీయమని మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. మార్కాపురం ప్రెస్,క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను సోమవారం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి రిబ్బను కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య జర్నలిస్టులు వారధిగా పనిచేయడం అందరికీ తెలిసిన విషయమే అన్నారు. కానీ మార్కాపురం ప్రెస్,క్లబ్ ద్వారా జర్నలిస్టులు సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు.


ఇప్పటికే ప్రెస్,క్లబ్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. కరోనా మొదటి, రెండవ తరంగాల (వేవ్) సమయంలో అంబులెన్స్, ఆక్సిజన్ సేవలు ఎంత కీలకమయ్యాయో అందరికీ తెలిసిందే అన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి అన్నారు. కరోనా మూడవ తరంగం (3rd Wave) పొంచివున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంబులెన్స్, ఆక్సీజన్ సేవల అవసరం ఎంతో ఉందన్నారు. ప్రెస్,క్లబ్ నిర్వాహకులు ముందుగానే ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభించడం శుభపరిణామమన్నారు.

ముందుగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి రిబ్బను కత్తిరించిగా ఆర్డీఓ కె.లక్ష్మీశివజ్యోతి జెండాఊపి ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, మండలాధ్యక్షురాలు పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్లు షేక్ ఇస్మాయిల్, సీహెచ్. అంజమ్మ శ్రీనివాసులు, ప్రెస్,క్లబ్ గౌరవాధ్యక్షులు కె.రామకృష్ణ, అధ్యక్ష, కార్యదర్శులు డి.మోహన్ రెడ్డి, పి.రామాంజనేయులు, ఉపాధ్యక్షులు బాషా,

అన్ను, ఓబయ్య, సహాయ కార్యదర్శులు ఎ. కృష్ణయ్య గౌడ్, వై.శ్రీనివాసులు, సభ్యులు కేజీ ప్రకాష్, వై.సుబ్బారావు, బి.సురేష్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

          


          

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: