కట్టు దాటితే... వేటే
క్రమశిక్షణారాహిత్యం అధికారులకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక
(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)
క్రమశిక్షణ లేకుండా పనిచేస్తున్న అధికారులను సస్పెండ్ చేస్తానని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. పెద్దారవీడు మండలం, తోకపల్లి గ్రామ సచివాలయాన్ని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ.టి.ఎస్. లబ్దిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కలెక్టర్ అందచేశారు.
గ్రామసచివాలయం సిబ్బంది హాజరు, సంబంధిత దస్త్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఓ.టి.ఎస్.లో పురోగతి లేని ప్రాంతాలపై అధికారులను నిలదీశారు. చెట్లమిట్ల గ్రామంలో 456 మంది ఓ.టి.ఎస్. లబ్దిదారులుండగా కేవలం 308 మందిని ఇప్పటివరకు సర్వే ద్వారా గుర్తించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తోకపల్లి గ్రామంలో 250 మంది ఓ.టి.ఎస్. లబ్దిదారులుండగా 115 మందిని గుర్తించగా కేవలం 86 మంది రుణం తిరిగి చెల్లించడంపై ఆయన ఆరా తీశారు. వి.ఆర్.ఓ. హాజరు 62 శాతం, వెల్ఫేర్ అసిస్టెంట్ హాజరు శాతం 43 శాతం ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులకు సక్రమంగా ఎందుకు హాజరు కావడం లేదని నిలదీశారు. ఓ.టి.ఎస్. పురోగతిని వివిధ సంక్షేమ పధకాల అమలులోను పురోగతి లేకపోవడంతో కలెక్టర్ మండిపడ్డారు.
పెద్దారవీడు మండలంలో ఈ నెల 28వ తేది మంగళవారం రెవిన్యూ స్పందన కార్యక్రమము నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. నెలరోజుల నుంచి పలుమార్లు చెప్పినప్పటికి సరిగా పనిచేయకపోతే ఊరుకొనేది లేదని కలెక్టర్ మందలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన హెచ్చరించారు. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ఆ మండలంలోని అధికారులు, సిబ్బంది విఫలమయ్యారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులు పలువురు రెవిన్యూ సమస్యలపై కలెక్టరుకు వినతి పత్రాలు సమర్పించారు. ఎన్ని పర్యాయాలు వినతి పత్రాలు సమర్పించినప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. దీనితో రెవిన్యూ అధికారులు ఈ ప్రాంతంలో పనిచేయడం ఇష్టం లేదా, ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కరించరు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట మార్కాపురం ఆర్.డి.ఓ. కె.లక్ష్మీశివజ్యోతి, తహసిల్దార్ ఉమారాణి, ఎమ్.పి.డి.ఓ. సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: