శ్రీవారిని దర్శించుకున్న...
శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే
(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)
శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సే తన సతీమణి షిరాంతి రాజపక్సేతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధానికి టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి మహద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీలంక ప్రధాని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత జెఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ నారాయణస్వామి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, రిసెప్షన్ డెప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?
ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: