వాలంటీర్ ను నియమించండి

డిఈఓకు విజ్ఞప్తి చేసిన బిలకలగూడూరు గ్రామ ఉపాధ్యాయులు...

సానుకూలంగా స్పందించి, అనుమతించిన డీఈవో రంగారెడ్డి

డి ఈ ఓ కు వినతి పత్రం అందజేస్తున్న హెచ్ ఎం రవి కుమార్

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజవర్గం, గడివేముల మండలంలోని బిలకలగూడూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఖాళీగా ఉన్న హిందీ పోస్టుకు విద్యావలంటీర్ లతో భర్తీ చేయాలని డీఈఓ రంగారెడ్డికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.రవి కుమార్ కోరారు. ఈ మేరకు డీఈఓ రంగారెడ్డికి పాఠశాల  ప్రధానోపాధ్యాయుడు  డి.రవి కుమార్ వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం పరిశీలించిన డీఈఓ రంగారెడ్డి ప్రస్తుతం ప్రభుత్వం వాలంటీర్లును నియమించేందుకు అనుమతులు లేవని, వారికి జీతాలు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా దాతలు ముందుకు వస్తే వాలంటీర్లను నియమించుకొనేందుకు అనుమతి మంజూరు చేస్తామని తెలిపారు.


ఈ విషయంపై  స్పందించిన బిటిఎఫ్ బహుజన టీచర్స్ ఫెడరషన్  జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్ హిందీ భాష బోధన చేసే వాలంటీర్లకు ఈ అకాడమిక్ ఇయర్ జీతాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో డీఈఓ వాలంటీర్లను నియమించుకొనేందుకు అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి టి ఎఫ్ నేతలు కే.సతీష్ కుమార్, జిల్లా అధ్యక్షులు జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: