ఆపన్నులకు అండదండలు అందించండి

గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ 


(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం మానవ జీవితంలో అంతర్భాగం కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విపత్కర పరిస్ధితుల కారణంగా సర్వం కోల్సోయిన వారికి ప్రతి ఒక్కరూ తమవంతు సాయం అందించాలన్నారు.  తన విచక్షణాధికారాలతో రెడ్ క్రాస్ కు సమకూర్చిన రూ.25 లక్షల నిధులతో వరద బాధితుల సహాయార్ధం సమకూర్చిన సామాగ్రితో సిద్ధం చేసిన లారీలకు గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వివిధ సందర్భాలలో రెడ్ క్రాస్ వాలంటీర్లు అందిస్తున్నసేవలు వెలకట్టలేనివన్నారు. కరోనా కష్టకాలం ఇంకా ముగియ లేదని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముఖముసుగు ధరించటం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం, సామాజిక దూరం పాటించటం తప్పనిసరని గవర్నర్ అన్నారు. తొలి విడతగా వెయ్యి కుటుంబాల కోసం సామాగ్రిని సిద్దం చేయగా, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో వీటిని రెడ్ క్రాస్ నేతృత్వంలో పంపిణీ చేయనున్నారని రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా గవర్నర్ కు వివరించారు.  ఒక్కో కుటుంబానికి పదికిలోల బియ్యం, ఒక్కొక్క కిలో కందిపప్పు, పెసరపప్పు, గోధుమపిండి, ఇడ్లీరవ్వ, పంచదార, ఉప్పు, చింతపండు, మిరపపొడి, దుప్పటి తదితర వస్తువులతో కూడిన కిట్ ను అందిస్తున్నామని రెడ్ క్రాస్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. తన విచక్షణాధికారాలతో గవర్నర్ వరద బాధితుల సహాయార్ధం రూ.25 లక్షలు కేటాయించటం చిన్న విషయం కాదని రెడ్ క్రాస్ కార్యదర్శి ఎకె ఫరీడా అన్నారు. కార్యక్రమంలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: