ప్రకాశం జిల్లా ప్రజలకు... ఇది చీకటి రోజు

కందుల నారాయణరెడ్డి

(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

 ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజలకు చీకటి రోజు అని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల  నారాయణ రెడ్డి పేర్కొన్నారు.  సోమవారం నాడు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పొదిలిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఎర్రగొండపాలెంలోని వివాహ వేడుకలకు విచ్చేసి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పై అధికారులతో కనీసం రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించలేదని మరియు ఆర్ ఆర్ ప్యాకేజీ 1200 కోట్ల రూపాయలలు రిలీజ్ చేయకుండా వెలిగొండ ప్రాజెక్టు ను మూలనపడవేశారని తెలియజేశారు.


తద్వారా ప్రకాశం జిల్లా ప్రజలకు ఈ రోజు చీకటి రోజు అని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు కు నికర జలాల కొరకై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గత ఆరు నెలల నుంచి పోరాటాలు చేస్తుంటే పోలీస్ శాఖ ద్వారా ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని తెలియజేశారు. రాయలసీమకు నికర జలాలు కేటాయిస్తూ ఉన్న ముఖ్యమంత్రి వర్యులు వెలిగొండ ప్రాజెక్టు కూడా 42 టీఎంసీల నికర జలాలను కేటాయించి ప్రకాశం జిల్లా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ప్రజల మీద ఉన్న ప్రేమ,  వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజల మీద లేదా అని ప్రశ్నించారు.     

                    ఇటీవల కాలంలో అకాల వర్షాలకు ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో మిరప, సెనగ, పత్తి, కంది.మినుము పంటలు     తుడిచిపెట్టుకుపోయిన ఇంతవరకు రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించలేదని ఇకనైనా సదరు పంటలకు పంట నష్ట పరిహారం విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  ఆ తరువాత సూర్య దినపత్రిక 2022 వార్షిక  క్యాలెండర్ ను విడుదల చేశారు. ఆ తరువాత మంజునాద ఫంక్షన్ హాల్ లో పెన్ పవర్ 2022 వార్షిక  క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: