దుండగులపై చర్యలు తీసుకోండి

బీజేపీ నేతల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

అర్ధరాత్రి గిద్దలూరు పట్టణంలో ఆంజనేయ స్వామి విగ్రహం అవమానకరంగా తొలగించడం పై చర్యలు తీసుకోవాలని ప్రకాశంజిల్లా కలెక్టర్ కు బీజేపీ నేతలు కోరరారు. గిద్దలూరు పట్టణంలో గురువారం రాత్రి జువిళ్ళబావి వినాయక దేవాలయం ఆవరణంలోని ఆంజనేయస్వామి విగ్రహాన్ని విధ్వంసం గావించిఅవమానకరంగా తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి మనవిచేస్తూ, ఆయన అందుబాటులో లేనందున ప్రకాశం జిల్లా డి ఆర్ ఓ పి.శ్రీనివాసులుని కలసి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది.ఆంజనేయ స్వామి విగ్రహము తొలగించడంపై నిరసనగా స్థానిక హిందూ సంఘాలు, ప్రజలతో కలిసి బీజేపీ ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు యస్.శ్రీనివాసరావు ఆమరణదీక్షను ప్రారంభించారు. విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించి ,


దోషులపై చర్యతీసుకోనే వరకు ఆమరణ దీక్ష కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ గారిని వినతిపత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనారిటీ మోర్చా ఫార్మేర్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్. ఖలీఫాతుల్లాబాషా,బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ శ్రీ.కనుమలు రాఘవులు, బీజేపీ ఒంగోలు నగర ఒకటవ మండల అధ్యక్షుడు పి.మధు యాదవ్,బీజేపీ ఒంగోలు నగర ఐదవ మండల అధ్యక్షుడు కంభంపాటి అంజనేయలు తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: