రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, దేశం సుభిక్షం

నారా చంద్రబాబు నాయుడు

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

రైతు సోదరులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రైతు దినోత్సవాన్ని పురష్కరించుకొని ఆయన ట్విట్ చేశారు. ట్విట్ లో ఆయన ఇలా పేర్కొన్నారు... దేశానికి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ రోజు రైతు పడే కష్టాలు చూస్తుంటే బాధగా ఉంది. దుక్కిదున్ని, విత్తనం నాటి, పంటను అమ్మి డబ్బు చేతకొచ్చే వరకు  ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒకరోజు రుణాల కోసం, మరో రోజు విత్తనాల కోసం, ఇంకో రోజు ఎరువుల కోసం, చివరకు పంటను అమ్ముకోవడం కోసం, తరువాత ధాన్యం డబ్బుల కోసం రైతులు రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన దుస్థితి.  

రాష్ట్రంలో ప్రభుత్వసాయం, పంటలకు కనీస మద్ధతు ధర లేక వ్యవసాయం సంక్షోభంలో ఉంది. దీంతో ఏపీలో 93 శాతం మంది రైతులు రుణభారంలో మునిగిపోయారు. రుణభారంలో రాష్ట్రాన్ని దేశంలో మొదటిస్థానంలోకి నెట్టారు. దీనివల్ల ఆత్మహత్యల్లో కౌలు రైతులు 2వ స్థానంలో, రైతులు ఆత్మహత్యల్లో మూడువ స్థానంలో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన  రైతు రుణమాఫీని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. వరి పంట వేయొద్దని ప్రభుత్వమే చెప్పడం రైతులను అవమానించడమే. కౌలు రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. కనీస మద్ధతు ధరకు వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేసి వెంటనే నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. అని ఆయన పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ రాబోతోంబది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


            


 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: