మత మారణకాండకు కుట్ర చేస్తున్న 

మతోన్మాదులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలి

ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

దేశంలో మత మారణకాండకు కుట్రలు చేస్తున్న హిందూత్వ సంస్థల నాయకులు స్వామి ప్రబోధానంద్, ధరమ్‌దాస్‌, సాధ్వి అన్నపూర్ణ, సురేశ్‌ చావాంకే, సింధూరాజ్‌ మహరాజ్‌  లను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ముస్లింలను లక్ష్యంగా చేసుకొని హిందూత్వ సంస్థల ప్రతినిధులు చేసిన మత విద్వేష ప్రసంగాలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు  తీవ్రంగా ఖండించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ విజ్ఞప్తి చేశారు. హరిద్వార్‌లో 'ధర్మ సన్సద్‌' పేరుతో జరిగిన  సభలో  విషం చిమ్మే, విద్వేషాల ప్రసంగాలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా   మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ


ధర్మసంసద్ పేరు జరిగిన సభలో మతోన్మాదులు చేసిన ప్రసంగాలు  భారత రాజ్యాంగ వ్యతిరేకం, అవి కేవలం విద్వేష ప్రసంగాలు మాత్రమే కాదు, హింసకు పాల్పడాలంటూ మెజార్టీ ప్రజల్ని రెచ్చగొట్టి, దేశంలో మత మారణకాండ సృష్టించి, దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు చేసారు. మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను చంపాలంటూ ఉగ్రవాదాన్ని ప్రేరేపించారు.ముస్లింలపై దాడులకు తెగబడండి అంటూ యతి నరసింహానంద, చంపటమో, చావటమో చేయాలని 'ఆయుధాలతో హత్యాకాండకు సిద్ధం కావాలని మయన్మార్‌ లో రోహింగ్యా ముస్లింలను తరిమికొట్టినట్టు భారత్‌లో ముస్లింలపై దాడులకు తెగబడాలని సుదర్శన్‌' న్యూస్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ సురేశ్‌ చావాంకే పిలుపునిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. కేంద్రంలో మోడీ సర్కార్‌, ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ మద్దతుతోనే హిందూత్వ సంస్థలు ఇలా రెచ్చిపోతున్నాయి.  

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్థాపించిన 'హిందూ యువవాహినీ'  సభలో 'సుదర్శన్‌' న్యూస్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ సురేశ్‌ చావాంకే ప్రసంగిస్తూ భారత్‌ను హిందూత్వ దేశంగా ఏర్పాటుచేయటం కోసం చంపటమో చావటమో చేయాలంటూ విద్వేషాన్ని రగిలించాడు. 'హిందూ యువ వాహినీ కార్యకర్తలతో ప్రమాణం చేయించాడు. యూపీ మంత్రి రాజేశ్వర్‌ సింగ్‌ సమక్షంలోనే ఈ ప్రసంగాలు జరగడం సిగ్గుచేటు. దేశంలోని లౌకిక ప్రజాస్వామ్య పార్టీలన్నీ దీనిపై స్పందించాలని, ఈ ప్రసంగాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. విషపూరితమైన విద్వేష ప్రసంగాలను నిరశిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శాబాజ్ ఖాన్, ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, ఎస్పీ, ఎస్టి, మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సనావుల్లా ఖాన్, ఆవాజ్ నాయకులు ఫయ్యాజ్,  అక్మల్ పాషా,  అలీ, హీనా, ఇబ్రహీం, యాకూబ్, ఇమామ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి     

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: