ఆరోగ్య సమస్యలపై,,,

అవగాహన సదస్సు

(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణములో ఈ రోజు ప్రెస్ క్లబ్ నందు చిన్న పిల్లల సమస్యలతో పాటు స్రీ సమస్యలు , క్యాన్సర్ గురించి అవగాహన సదస్సు పి.యం.పి. వైద్యులకు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సదస్సునకు షేక్.మౌలాలి అధ్యక్షతన ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సదస్సులో ఒంగోలు సాయివీణ హాస్పటల్  డాక్టర్ లక్కిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి, డాక్టర్ వీణ, డాక్టర్ నవీన్ బాబు, డాక్టర్ మగ్బుల్ బాష, అన్ని మండలాల నుంచి సుమారు 200మంది పి.యం.పి. వైద్యులు పాల్గొన్నారు.


ఇదే సందర్భములో పాల్గొన్న అందరి సమక్షములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ నూతన కమిటీని ఎన్నుకోవటం జరిగినది. అధ్యక్షులుగా షేక్.మౌలాలి, మార్కాపురం,  టి.వి.వెంకటసుబ్బయ్య, రషీద్ ఖాన్, జనరల్ సెక్రటరిగా ఎన్. సుబ్బారావు, జాయింట్ సెక్రటరిగా షంషీర్ అహమ్మద్, షేక్. మొహమ్మద్ రహీం, ట్రెజరర్ గా యల్. మాలకొండయ్య, కార్యవర్గ సభ్యులుగా షేక్.అబ్దుల్ గని, బిస్వజిత్ కుమార్, సయ్యద్ రసూల్ ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. 

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

     

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: