ఎమ్.పి.జె ఆధ్వర్యంలో...., 

టి.ఎన్.జి.వోస్ నేత అఫ్జల్ హసన్ చే నిరుపేదలకు దుప్పట్ల  పంపిణీ 

(జానో జాగో వెబ్  న్యూస్- ఖమ్మం ప్రతినిధి)

 ఖమ్మం నగరంలోని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎమ్.పి.జె)  కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిమ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేక్. అఫ్జల్ హసన్, టి.ఎన్.జి.వోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు, పాల్గొని నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు . ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ఎమ్.పి.జె చేస్తున్న సామాజిక  కార్య క్రమాలు అభినందించారు. ఈ సంస్థ చేస్తున్న వివిధ రంగాల్లో సేవలను కొనియాడుతూ, తాను ఎల్లప్పుడూ అండగా జిల్లా ఎమ్.పి.జెకు అండగా  ఉంటానని తెలిపారు. జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్ మాట్లాడుతూ


రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా ఎమ్.పి.జె సంస్థ స్థాపించ బడిందని తెలిపారు. ప్రసంగించిన వారిలో షౌకత్ అలీ, నజీముద్దీన్, ముక్తార్, సాగర్, ఖాలిద్ లు ఉన్నారు.  అనంతరం జిల్లా ఎమ్.పి.జె అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు ముఖ్య అతిధి, ఉద్యోగ సంఘాల నేతగా ఎన్నిక కాబడిన అఫ్జల్ హసన్ బృందానికి అభినందనలు తెలిపి మిఠాయిలు తినిపించి, పుష్ప గుచ్ఛాలు, శాలువా లతో ఘనంగా సత్కరించారు. 

ఈ కార్యక్రమం లో అతిధులు షౌకత్ అలీ ( మాజీ కార్పొరేటర్), ముక్తార్ (సుడా డైరెక్టర్), నజీముద్దీన్ (సేవా బ్యాంకు డైరెక్టర్), ఆర్.వి.ఎస్.   సాగర్ (టి.ఎన్.జి.వోస్ కార్యదర్శి), ఎమ్.పి.జె జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్.ఏ. గఫార్, ప్రధాన కార్యదర్శి ఎమ్.డి. నాసర్, కార్యదర్శులు రజబాలి, సతీష్, రఫీఖ్, కోశాధికారి ఎమ్.డి. హకీమ్, మీడియా సెక్రటరీ చక్రి, అజీజ్, గఫార్, పాషా, అఫ్సర్, హుస్సేన్, బియాబాని, ఖాలిక్, జాని, నయీమ్, అన్వర్, ఖాదర్ తదితర ఎమ్.పి.జె నాయకులు పాల్గొన్నారు .


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: