వెబ్ సైట్ లో జీవోలను ఎందుకు పెట్టడంలేదు

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

(జానో జాగో వెబ్ న్యూస్-లీగల్  ప్రతినిధి)

వెబ్‌సైట్‌లో జీవోలను ఎందకు పెట్టట్లేదు?.. సాఫీగా జరిగే ప్రక్రియకు ఎందుకు ఆటంకం కల్పిస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘జీవోల్లో 5శాతమే వెబ్‌సైట్‌లో ఉంచుతున్నారు. ప్రభుత్వ తీరు సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకం’’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. అయితే అతి రహస్య జీవోలు మాత్రమే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయట్లేదని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు అనంతరం హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. జీవోలు రహస్యం, అతిరహస్యమని ఎలా నిర్ణయిస్తారు? అన్ని జీవోల వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: