ప్రభాస్ చిత్రంలో కృష్ణంరాజు..
అదికూడా అదిరేటి లుక్ లో
(జానో జాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)
‘బిల్లా’, ‘రెబల్’ తర్వాత ప్రముఖ నటులు కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. కృష్ణంరాజు పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో ఆయన కాషాయం రంగు వస్త్రాల్లో.. జపం చేస్తూ కనిపించారు. ఈ సినిమాలో ఆయన పరమహంస అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ పోస్టర్‌లో కృష్ణంరాజు కొత్తగా కనిపించటంతో విడుదలైన కొన్ని క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 70ల కాలం నాటి ప్రేమకథతో రూపొందుతున్న చిత్రమిది. ప్రభాస్ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?
ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: