చెరకు రైతుల బకాయిలు చెల్లించండి

సీఎంకు సీపీఐ నేత కె.రామకృష్ణ లేఖ

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. చెరకు రైతుల బకాయిలను చెల్లించేందుకు తక్షణ చర్యలు చేపట్టండి అని ఆయన ఆ లేఖలో  కోరారు. చెరకు రైతులకు పరిశ్రమల యాజమాన్యాలు రూ.120 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని గుర్తుచేశారు.   విశాఖ జిల్లా తాండవలో ఒక రైతు మరణించారని, ఆందోళన చేపట్టిన చెరుకు రైతులపై పలుచోట్ల పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆయన  పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు మీరు ఇచ్చిన హామీలు విస్మరించడం తగదన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,





  


 


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: